‘అర్జున్ రెడ్డి’ హిట్టా..ఫట్టా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన దేవరకొండ విజయ్ ఆ తర్వాత హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రంలో నటించాడు.  ఈ చిత్రంలో విజయ్ అద్భుతమైన నటన కనబరచడంతో మంచి పేరు సంపాదించాడు.  ఇక ‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  తర్వాత వచ్చిన ద్వారక చిత్రంతో మాస్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా అర్జున్ రెడ్డి చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు.  

అయితే ఈ చిత్రం మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలకు గురి అవుతూ వచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు ఏ హీరో మాట్లాడని మాటలు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో దేవరకొండ విజయ్ మాట్లాడాడు..దీంతో కొంత మంది ఈ మాటలపై విమర్శలు గుప్పించినా..సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం షెబాష్ నా తర్వాత ఎవరు వస్తారా అనుకున్నా..నేను బతికి ఉండగానే మరో మొనగాడు వచ్చాడని కితాబు ఇచ్చాడు.  ఇక సినిమా విషయానికి వస్తే..మెడిసన్ చదువుతున్న ఓ టాప్ ర్యాంకర్ విద్యార్థి ప్రేమలో పడటం..తర్వాత బెడిసి కొట్టగానే చెడు అలవాట్లకు  బానిసై తన కెరీర్ ని ఎలా నాశనం చేసుకున్నాడనేది చిత్ర సారంశం.

ఈ చిత్రంలో ఒక యాంగ్రీ స్టూడెంట్ గా విజయ్ అద్భుతమైన నటన ప్రదర్శించడమే కాదు..ఆ పాత్రకు విజయ్ మాత్రమే సూట్ అవుతాడని నిరూపించాడు. తన సెలెక్ట్ చేసుకునే సినిమాల మీద నమ్మకంతోనే కాబోలు విజయ్ దేవరకొండ అంత కాన్ఫిడెంట్ గా కనబడతాడు.అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి ఎందుకు తన సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నాడో సినిమా చూస్తే అర్ధం అవుతుంది.

కథను చెప్పే విధానంలో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అందించాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి పాత్ర తెరకెక్కించిన తీరు సింప్లీ సూపర్బ్. సినిమాకు వాడిన రియల్ లొకేషన్స్ బాగా కనువిందు చేశాయి. రాధన్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించింది.  ప్రీతి రెడ్డి తండ్రి పాత్ర కూడా ఇంప్రెస్ చేసింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.  రాజు తోట సినిమాటొగ్రఫీ బాగా అనిపిస్తుంది. గతంలో ఇలాంటి ప్రేమ చిత్రాలు కాలేజ్ లైఫ్ గురించి వచ్చాయి..కానీ ఈ సినిమా టేకింగ్ చాలా బాగుంది.  

ఒకప్పుడు ప్రేమ సాగరం లాంటి సినిమా కాలేజ్ వాతావరణంతో ముడి పడి ఉంటుంది..ఆ సినిమాలో ప్రేమ విఫలమైన స్టూడెంట్ ఎన్ని బాధలు పడతాడో కళ్లకు కట్టినట్లు చూపించారు..దర్శకులు టి,రాజేంద్ర .  అందుకే ఆ సినిమా  ఇప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది.  మొత్తానికి సినిమా ప్రీమియం టాక్ షో మాత్రం కాస్త పాజిటీవ్ గానే వస్తుంది..మరి రేపటి వరకు సినిమా పై సగటు ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉంటుందో..సినిమా హిట్టా..ఫట్టా అనే విషయం తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: