ఆ విషయంలో..ప్రకాశ్ రాజ్ కి కోపం వచ్చింది..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రకాశ్ రాజ్ కి ఓ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారత దేశంలో జర్నలిస్ట్ లకు రక్షణ లేకుండా పోయిందని..నిజాన్ని నిర్భయంగా తెలియజేసే వారికి జీవించే హక్కులేదా అని కోపగించుకున్నారు.

నిన్న కొంత మంది దుర్మార్గుల చేతిలో నిర్ధాక్షిణ్యంగా హత్యకు గురైన గౌరీ లంకేష్ హత్యవార్త విని చలించిపోయిన ప్రకాష్‌రాజ్‌ 'మతాన్ని అడ్డంపెట్టుకుని డబ్బుమదంతో అధికారం చేపట్టిన వాళ్లను పెంచిపోషిస్తున్న మనమే ఈ తప్పు చేశామం'టూ బాధపడ్డారు.  గౌరీ లంకేష్ గత 30 సంవత్సరాలుగా పరిచయం తనకు పరిచయం అని సమాజంలో జరుగుతున్న అన్యాయలపై ప్రశ్నించే మంచి మనస్తత్వం ఉన్న జర్నలిస్టు అని ఇవి కొంత మందికి గిట్టేవి కావని అందుకే ఆమెను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పే వ్యక్తులను చంపితే మరెన్నో గొంతులు పుట్టుకొస్తాయని ఆయన అన్నారు. గౌరిని హతమార్చిన వ్యక్తులు పిరికివాళ్లని.. ఇటువంటి చర్యలు పాల్పడే దేశద్రోహులని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనీ అందుకోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.  గౌరీ లంకేష్ మరణానికి సంతాపంగా మీడియా సహకారం మరువలేనిదనీ..ఇలాంటి దుర్మార్గులకు శిక్ష పడే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: