దసరా కానుకగా మెగా గిఫ్ట్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మగధీర’ చిత్రంతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.  ఇండస్ట్రీలో రాంచరణ్ నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా సూపర్ డూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం.  గత సంవత్సరం ‘ధృవ’ చిత్రంతో మంచి విజయం అందుకున్న చెర్రీ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో  'రంగస్థలం 1985'  లో నటిస్తున్నాడు.  ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది.  

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఒక్క పోస్టర్ తప్ప ఎలాంటి డిటేల్స్ బయటకు రాలేదు. కాకపోతే సినిమా లొకేషన్ కి సంబంధించిన స్టిల్స్ బయటికి వచ్చాయి గానీ, ఫస్టులుక్ మాత్రం రాలేదు. తాజాగా మెగా ఫ్యాన్స్ హ్యాపీ న్యూస్ చెప్పారు చిత్ర యూనిట్. దసరా కానుకగా ఫస్టులుక్ ను వదలడానికి రంగం సిద్ధమైనట్టు చేస్తున్నారట. ఇక ఫస్ట్ లుక్ అదిరిపోయే లెవెల్లో చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.  ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా  'రంగస్థలం 1985' ఫస్ట్ లుక్  రిలీజ్ అవుతుందని అంటున్నారు.

'నాయక్' ఆడియో ఫంక్షన్ తరువాత పవన్ వస్తాడని చెబుతోన్న చరణ్ సినిమా ఇదే. దాంతో మెగా అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటి వరకు లవ్, యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన రాంచరణ్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. నటుడిగా తన సత్తాను చాటే చిత్రమవుతుందని చరణ్ భావిస్తున్నాడు. ఆయన సరసన సమంతా నటిస్తోన్న సంగతి తెలిసిందే.    
     



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: