ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ హిట్టా..ఫట్టా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో గత మూడు సంవత్సరాలుగా నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గోల్డెన్ టైమ్ నడుస్తంది అనడంలో అతిశయోక్తి లేదు.  టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.  తాజాగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యంలో.. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘జై లవ కుశ’ చిత్రం రిలీజ్ అయ్యింది.  

మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతూ వచ్చాయి.  మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్ మూడు పాత్రలో నటించారు..అంతే కాదు ఓ పాత్రలో అయితే పూర్తి నెగిటీవ్ గా కనిపించడం మరో విశేషం.  గత కొన్ని రోజుల నుంచి జై లవ కుశ సినిమా ప్రమోషన్ కూడా భారీ స్థాయలోనే చేస్తూ వచ్చారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న బిగ్ బాస్ షో లో శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.  

ఈ మద్య జై లవ కుశ సినిమా ప్రమోషన్ కూడా చేశారు.  దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.  సినిమా విషయానికి వస్తే..ఫస్ట్ హాఫ్ లో   లవ కుశ లు మాత్రమే ప్రేక్షకుల ను ఎంటర్ టైన్ చేయగా ఇంటర్వెల్ బ్యాంగ్  లో ‘జై’ పాత్రతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ దుమ్మురేపారట. జై .. లవ .. కుశ ఈ మూడు భిన్నమైన పాత్రలనీ, దాంతో ప్రతి పాత్రకు మధ్య గల తేడా స్పష్టంగా తెలిసేలా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు.

మూడు పాత్రలు ఒకేసారి ఒకేలా కనిపించే సందర్భాల్లోను ఆయా పాత్రలకు అనుగుణంగా నటించడం నిజంగా ఎన్టీఆర్ కే సాధ్యం అయ్యిందని అంటున్నారు ఫ్యాన్స్.  మాట తీరు .. బాడీ లాంగ్వేజ్ లో ఆయన చూపిన వైవిధ్యం ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు.  ఆ మద్య కళ్యాన్ రామ్ అన్నట్లు ఇది ఎన్టీఆర్ మాత్రమే చేయదగిన సినిమా అనీ .. ఆయన కనుకనే అంత బాగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. కాకపోతే   సినిమాకు ప్రధాన మైనస్ ఆకట్టుకునే కథనం లేకపోవడమే.  

బాబీ కొత్త లైన్ నే పట్టుకుని దాన్ని సగం వరకు బాగానే నడిపినా ఆ తర్వాత మాత్రం పూర్తిగా తేల్చేశాడ కూడా టాక్ వస్తుంది. ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ సినిమాకు మంచి బలం అయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.    బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించగా ఎన్టీఆర్ నట విశ్వరూపం కు తోడూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది.

హీరోయిన్లు రాశీ ఖన్నా, నివేదితా థామస్ లు కూడా తమ నటనకు మంచి న్యాయం చేసినట్లు చెబుతున్నారు.  ఏది ఏమైనా సినిమా టాక్ సాయంత్ర వరకు ఎలా ఉంటుందో..రేపటి కలెక్షన్లను బట్టి సినిమా హిట్టా..ఫట్టా అని తేలిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: