విజయ్ 'మెర్సెల్' సినిమాకు షాక్..!

Edari Rama Krishna
తమిళ ఇండస్ట్రీలో హీరో విజయ్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ మద్య తెలుగు లో కూడా తన చిత్రాలు విడుదల చేస్తూన్న విజయ్ ఇక్కడ కూడా తన అభిమానులను సంపాదించాడు.  తాజాగా  అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందించనున్నారు. హీరో విజయ్ కెరీర్ లో మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.  

విజయ్ సరసన సమంత, కాజల్, నిత్యామీనన్  నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న విజయ్ ‘మెర్సెల్’ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తుంది.  దీపావళి సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ రికార్డు కొల్లగొడుతున్న సమయంలో ‘మెర్సెల్’ టైటిల్ ను తాను 2014లోనే రిజిస్టర్ చేయించాననీ, నిబంధనలకు విరుద్ధంగా తన టైటిల్ ను వాడేస్తున్నారని పిటీషన్ దారు చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.   ఈ సినిమాలో రాజకీయనాయకుడిగా .. మెజీషియన్ గా .. డాక్టర్ గా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

కాగా, ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు .. ఈ సినిమా ప్రమోషన్స్ ని అక్టోబర్ 3వ తేదీ వరకూ నిలిపివేయమంటూ తాత్కాలిక నిషేధాన్ని విధించింది. దాంతో 10 రోజుల పాటు ఈ సినిమా ప్రమోషన్స్ ను నిలిపివేయవలసిన పరిస్థితి వచ్చింది. ఒక రకంగా ఇది 'మెర్సెల్' కి చిత్రానికి పెద్ద షాక్ అని అంటున్నారు తమిళ ఇండస్ట్రీ వర్గం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: