ఎన్టీఆర్ నటన కొలమానం చెప్పాడు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో వరుసగా విజయాలతో దూసుకు వెళ్తున్నాడు నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.   టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ఈ మద్య బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘జై లవ కుశ’ చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  ఓ స్టార్ హీరో ఇలా వరుస విజయాలు అందుకోవడం చాలా అరుదు అని ఇండస్ట్రీ వర్గం అనుకుంటున్నారు.  గతంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు భిన్నంగా ‘జై లవ కుశ’ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు యంగ్ టైగర్.  

తాజాగా తాజాగా జై లవ కుశ చిత్రం సక్సెస్ మీట్ జరిగిన నేపథ్యంలో రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేశారు.  సాధారణంగా ‘జ్వరాన్ని కొలవడానికి థర్మామీటర్‌ ఉంది. పాల కేంద్రంలో పాల చిక్కదనం చెప్పడానికి లాక్టోమీటర్‌ ఉంటుంది. రక్తంలో షుగర్‌ స్థాయి చెప్పడానికి గ్లూకో మీటర్‌ ఉంటుంది.  

మరి ఎన్టీఆర్ నటన కొలవడానికి ఏ మీటర్ ఉంటుందో చెప్పగలరా..చెప్పగలం ఆయన నటనను కొలిచేందుకు ఓ మీటర్ ఉంది..అదే ఈస్తటిక్‌ మీటర్‌. ఇంతకీ ఈస్తటిక్ మీటర్ అంటే ఏంటో అనుకుంటున్నారా..! తెలుగులో రసహృదయం. అది ఉన్న వారికి ఎన్టీఆర్‌ ఎంత దమ్ము ఉన్నవాడో తెలుస్తుంది.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో రెండు చిత్రాల్లో నటించానని ఒకటి ‘టెంపర్‌’, రెండు ‘జై లవకుశ’.

సినిమాలు అంటే తారక్ కి ఎంతో అభిమానమని..నటన పరంగా ఆయన ముందు ఎవరూ సరిపోరని అన్నారు.  టెంపర్ చిత్రంలో ఆయన ముందు డైలాగ్స్ ని చాలా సేపు బట్టి పట్టి మరీ చెప్పేవాడినని..ఆయన మాత్రం ఒక్క టేక్ లో అవలీలగా కంప్లీట్ చేసేవారని అంత గొప్ప ఏకసంతాగ్రహిని నేను ఎక్కడ చూడలేదని అన్నారు. ఏది ఏమైనా ‘జై లవ కుశ’ చిత్రంతో నాకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు వచ్చిందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: