శివారెడ్డి చెంప చెల్లుమనిపించాడట..ఆ డైరెక్టర్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో తమ సొంత టాలెంట్ ఉపయోగించి పైకి వచ్చిన నటులు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇండస్ట్రీలో రాణించాలంటే ఎదైనా బలమైన బ్యాగ్ గ్రౌండ్ ఉండాలనే ఈ రోజుల్లో తన మిమిక్రీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచి ఇండస్ట్రీలో రాణిస్తున్న నటుడు శివారెడ్డి.  అయితే హాస్య నటుడు , మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన శివారెడ్డిని దర్శకులు శ్రీను వైట్ల చెంప చెల్లుమనిపించాడట.

 ఎందుకు అలా తనపై చేయి చేసుకున్నాడో అర్థం కాక చాలా బాధపడ్డాట శివారెడ్డి.  ఈ మద్య ఆలీ నిర్వహిస్తున్న ఓ షో లో శివారెడ్డి తన మనసులో మాటలు చెప్పారు.  ఈ సంఘటన 2001 లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన ఆనందం చిత్రం సమయంలో.  అంతకు ముందు శ్రీను వైట్ల అపరిచితుడు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ చిత్రంలో హీరోగా డాక్టర్ రాజశేఖర్ నటించారు.  

కాకపోతే ఈ సినిమా మద్యలోనే ఆగిపోయింది.  దీంతో తన తదుపరి చిత్రంతో హిట్ కొట్టాలన్న తాపత్రయంతో ఉన్న శ్రీను వైట్లో మాస్ మహరాజ  రవితేజ హీరోగా నీకోసం అనే సినిమా చేసాడు అది హిట్ అయ్యింది దాంతో ఆనందం సినిమా ఛాన్స్ ఇచ్చారు రామోజీరావు.  ఆనందం షూటింగ్ సమయంలో ఒకరోజు ముందు రాత్రి అంతా షూటింగ్ చేశారట మరుసటి రోజు మాత్రం శివారెడ్డి రాలేనని కాకపోతే మధ్యాహ్నం తర్వాత వస్తానని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లకు చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళాడట.  

కాకపోతే ఆ  విషయాన్ని డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వారు శ్రీను వైట్లకు చెప్పడం మర్చిపోయారట. మరుసటి రోజు శివారెడ్డి కోసం డైరెక్టర్ వెయిటింగ్ చేయడంతో శ్రీను వైట్లకు విపరీతమైన కోపం వచ్చిందట.  శ్రీను వైట్ల కోపంగా ఉన్నాడని తెలుసుకొని శివారెడ్డి ని చూడగానే బండ బూతులు తిట్టి చెంప చెల్లుమనిపించాడట. తన తప్పు లేకున్నా కూడా దెబ్బ తినాల్సి వచ్చిందని పాత సంఘటన ని అలీ కి చెబుతూ మరోసారి బాధపడ్డాడు శివారెడ్డి . 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: