పవన్ కళ్యాణ్ కి నో చెప్పేసింది..అందుకేనా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఇండస్ట్రీలో అంతగొప్ప మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్ అనే చెప్పొచ్చు.  కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాన్.  జనసేన అనే పార్టీ స్థాపించి ప్రజల కోసం పోరాడుతున్నారు.  ఇప్పటికే రాజధాని భూముల పై ప్రజల పక్షం వహించిన పవన్..ఏపీకి ప్రత్యేక హోదా కోసం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. 

ఇప్పటికే తిరుపతి, అనంతపురం, కాకినాడలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు.  2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి పోటీ చేసేందుకు సంసిద్దం అవుతున్నారు.  ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్న పవన్ కళ్యాన్ కి ఓ సింగర్ షాక్ ఇచ్చింది.  సాధారణంగా పవన్ కళ్యాన్ తో సినిమా చాన్స్ వస్తే..ఎంతో సంబర పడతారు.

కానీ  సింగర్ పర్ణిక మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట . తాజాగా ఆ విషయాన్నీ చెబుతూ నాకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే తప్పకుండా చేస్తా అంతేకాని  అసభ్యంగా ఉండే పాత్రలు వస్తే చేసేది లేదని చెబుతోంది.   పవన్ కళ్యాన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించే అవకాశం వచ్చిందని కానీ ఆ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని దాని వల్ల తన కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడుతుందని అందుకే  ఆ సినిమా తిరస్కరించానని చెబుతుందతి పర్ణిక. 

పాటలు పాడటమే కాదు నటన అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని..ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే పర్ణిక సింగర్ గా మంచి పేరునే సంపాదించింది . వన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ వచ్చిందట కానీ చేయలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: