నిజం మాట్లాడితే..'యాంటీ మోడీ' అనేస్తారా?

Edari Rama Krishna
ఈ మద్య ప్రముఖ జర్నలిస్ట్  గౌరీ లంకేశ్‌ ని ఆమె ఇంటి వద్దే దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే.  దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా మీడియా రంగం తీవ్రనిరసనలు తెలిపింది.  తాజాగా హత్య జరిగి ఇన్ని రోజులైనా అసలు నింధితులను ఎందుకు పట్టుకోలేకపోయారని విమర్శించారు..విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌.  తాజాగా  విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదైంది. ప్రధాని మోడీ పై ప్రకాశ్‌రాజ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకు చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

‘‘గౌరీ లంకేశ్‌ను హత్య చేసిన వారిని పట్టుకోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు. ఆమె మృతిని సోషల్‌మీడియాలో వేడుకగా జరుపుకొన్నారు. వారు ఎవరో, వారి ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు’’ అని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.  అంతే కాదు నాకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. వాటిని వాపస్‌ ఇచ్చేస్తానేమో” అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేయడం పెను సంచలనాలకు దారి తీసింది.


అయితే నేరుగా ప్రధాని మోడీని అనకుండా పరోక్షంగా ఆయనపై వ్యంగాస్త్రాలు సందించారని  వాదనలు వినిపించాయి.  ఈనేపధ్యంలో ఇప్పుడు ఆయన పై కేసు కూడా నమోదైపోయింది. అక్టోబరు 7న ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలను విననుంది కోర్టు. దీనిపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్  తానెప్పుడైనా, ఎక్కడైనా సరే నిజమే మాట్లాడతానని అన్నారు. ప్రధాని మోదీ విషయంలో కూడా తాను నిజమే మాట్లాడానని ఆయన చెప్పారు.

నిజం మాట్లాడినంత మాత్రానికే 'యాంటీ మోదీ' అనేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మోదీ మన దేశ ప్రధాని అని, ఆయనపై తనకు పూర్తి గౌరవం ఉందని ఆయన తెలిపారు. అదే సమయంలో అన్ని విషయాల్లోనూ తాను ఆయనతో ఏకీభవించలేనని చెప్పారు. తనపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా..ఎలాంటి పరిణామాలు జరిగినా..ఎంత విమర్శించినా గౌరీలంకేశ్ మరణంపై తాను చేసిన వ్యాఖ్యలపై నిలబడతానని ఆయన తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: