విప్లవ దర్శకులు ఆర్ నారాయణ మూర్తి కి ‘కొమరం భీమ్’ జాతీయ పురస్కారం..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నటించి మెప్పించారు పీపుస్టార్ ఆర్ నారాయణ మూర్తి. 
చిన్ననాటి నుంచి సినీ నటుడు కావాలన్న ఆశయంతో ఉన్న ఆయన దాసరి నారాయణరావు పరిచయం వలన కృష్ణ సినిమా నేరము-శిక్షఈయనకు ఒక చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయనా ఒకడు. చిన్నవేషంతో నిరుత్సాహపడ్డాడు. కానీ, ఇంటర్మీడియట్ పాసైన విషయం తెలిసింది.

డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చాడు.  డిగ్రీ పాసై మళ్లీ ఇండస్ట్రీకి వచ్చిన ఆయనకు చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. తర్వాత హీరోగా ఎదిగిన నారాయణ మూర్తి సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారు..దానికి "స్నేహ చిత్ర" అని పేరు పెట్టుకున్నారు.  నారాయణమూర్తి నిర్మాత, దర్శకుడిగా తన మొదటి సినిమా ‘అర్ధరాత్రి స్వతంత్రం ’ తన రెండ ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో విప్లావాత్మక చిత్రాలు తెరకెక్కించారు. 

సాదారణ జీవితానికి ఇష్టపడే ఆర్ నారాయణమూర్తికి  “కొమరం భీమ్ జాతీయ పురస్కారం” 2017  ఎంపిక చేసినట్లుగా అవార్డు కమిటీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె వి రమణ చారీ, కో చైర్మన్ నాగబాల సురేష్ కుమార్, కొమరం సోనీ రావు, శిడాం శంభు, శిడాం అర్జులు ఈ అవార్డును ప్రకటించారు.  తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంసృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్స్టైన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ప్రతిష్టాత్మక “కొమరం భీమ్ జాతీయ పురస్కారం” 2017 గాను కొమరం భీమ్ వర్ధంతి(అక్టోబర్ 6న)  ఆయనకు ఇవ్వనున్నట్లు కమిటీ తెలిపారు. 

గతం లో ఈ అవార్డును కొమరం భీమ్ చిత్రం నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ లు అందుకున్నారు. ఈ నెల 3వ వారం లో జరిగే అవార్డు ప్రదానోత్సవం లో 51 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంస పత్రం, శాలువాతో సత్కరిసున్నట్టు కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ తెలిపారు. 

అర్దరాత్రి స్వతంత్రం, అడివి దివిటీలు, లాల్ సలాం,దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు,దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న లాంటి పలు చిత్రాలను రూపొందించి కొమరం భీమ్ ఆశయాలకు అనుగునంగా నిర్మించినవే కావున ఆర్ నారాయణ మూర్తి ఈ అవార్డు ఇవ్వడం సమంజసమని కె వి రమణ చారీ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: