బాలీవుడ్ ‘బిగ్ బాస్’ రచ్చ..రచ్చ.. సల్మాన్ ఖాన్ పై ఫిర్యాదు..!

Edari Rama Krishna
ప్రపంచ వ్యాప్తంగా టెలివిజన్ రంగంలో ఎంతో పాపులారిటీ సంపాదించింది ‘బిగ్ బాస్’ షో.  ఇప్పుడు బారత దేశంలో బలీవుడ్, కోలీవుడ్, షాండిల్ వుడ్ లో ప్రచారం అవుతుంది.  తెలుగు లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ హోస్ట్ లుగా ఉన్నారు.  ఇక బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ ఇప్పటికే 10 సీజన్లు పూర్తి చేసుకొని 11 వ సీజన్ రన్న అవుతుంది. 

ఇక బిగ్ బాస్ 11 వ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. తాజాగా వారాంతంలో వీకెండ్ కి వార్ ఎపిసోడ్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోని సభ్యుల ప్రవర్తనపై సల్మాన్ విరుచుకుపడ్డాడు. ఏం చేస్తున్నారో అర్ధమవుతోందా? అంటూ ప్రశ్నించాడు. మీమీ ఇళ్లలో తల్లి, అక్కచెల్లెళ్లతో ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఇందుకేనా బిగ్ బాస్ కు వచ్చారు?  మీ ప్రాంతం పేరు ప్రతిష్ఠలు మంటగలిపారని మండిపడ్డాడు. 

దావూద్ ఫ్యామిలీకి చెందిన జుబైర్ ఖాన్ పై సల్మాన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.   డోంగ్రీ నుంచి వచ్చానని, డాన్ లంతా డోంగ్రీ నుంచి వచ్చిన వారేనని బెదిరిస్తున్నావు? మీకు డాన్ లని ఏ స్కూల్ సర్టిఫికేట్ ఇచ్చింది? అని కడిగేశాడు. ఈ సందర్భంగా అర్షిఖాన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, నీక్కూడా చెబుతున్నాను... పద్దతిగా మసలుకోవడం నేర్చుకో అన్నాడు.

దీంతో మనస్థాపాని గురైన  జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నం చేశాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ షో నుంచి జుబైర్ ఖాన్ ఎలిమినేట్ కూడా అయ్యాడు. అనంతరం జుబైర్‌ ఖాన్‌ బిగ్ బాస్ హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ పై ముంబై థానెలోని అంటాప్‌ హిల్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: