బర్త్ డే స్పెషల్ : ఎవరన్నారు బిగ్ బి సినిమాలకు పనికిరాడని..!?

Vasishta

సినిమాలకు పనికిరావన్న విమర్శలను సవాల్ గా తీసుకుని నెంబర్ వన్ హీరోగా ఎదిగారాయన. విమర్శకుల నోటే శభాష్ అనిపించుకున్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా తన అద్భుత నటనతో అభిమానులను అలరిస్తూ... ఇప్పుడు కొత్త ప్రయోగాలకు తెరదీశారు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనో మెగాస్టార్.. బీటౌన్ టాప్ హీరోలందరికి ఆయన ఓ ఇన్స్ పైర్. ఆయనే ఒన్ అండ్ ఒన్లీ సూపర్ స్టార్ "అమితాబ్ బచ్చన్". ఇవాళ ఆయన బర్త్ డే.

 

ఇండియన్ సినిమా ఈస్ట్‌ మన్ కలర్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న రోజుల్లోనే బాలీవుడ్ లెజెండ్‌గా పిలిపించుకున్న నటుడు బిగ్ బి. సీనియర్ హీరోలతో పోటీపడి.. బాలీవుడ్ మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరోకూ లేని విధంగా హిట్ రేషియో ఉన్న ఏకైక హీరో అమితాబ్ బచ్చన్.

 

1973లో ప్రకాశ్ మెహ్రా డైరెక్ట్ లో వచ్చిన జంజీర్ సినిమా బిగ్ బీ కెరీర్ నే మార్చేసింది. దాదాపు 12 చిత్రాలు భారీ డిజాస్టర్ల తర్వాత అమితాబ్‌ని వరించిన జంజీర్ సినిమా.. అతడి కెరీర్‌ని అనుకోని మలుపుతిప్పింది. పరాజయం ఎప్పుడూ శాశ్వతం కాదు.. పోరాడితే పోయేదేం లేదు అని అమితాబ్‌కి జీవితం పాఠాలు నేర్పిన సమయం అది. జంజీర్ సినిమా తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అమితాబ్‌కి రాలేదు. కెరీర్ ఆరంభంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కష్టపడిన అమితాబ్ 70, 80లలో బిగ్ బి సినిమా వస్తోందంటే రికార్డుల దుమ్ము వదలాల్సిందే. అందుకే అమితాబ్ బచ్చన్ అనేది ఇండియాలో పేరు కాదు... ఇట్స్ ఏ బ్రాండ్.

 

అమితాబ్ కెరీర్ లో ఎన్నో మరుపురాని చిత్రాలున్నాయి. సిల్ ... ఖుదాగవా... దీవార్... షోలే.. కూలీ... సర్కార్.. కబీఖుషీ కబీఘమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే  రాసుకోడానికి  ఓ గ్రంథం కావాలి.. అసలు నువ్వు హీరో ఏంటి..?ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా..? అన్నవాళ్లే పిలిచి మెగాస్టార్ తో ఎన్నో సినిమాలు చేసే స్ధాయికి ఎదిగాడు అమితాబ్. అలా ఎన్నో సంచలనాలకు... ఇంకెన్నో అద్బుతాలకు... మరెన్నో సుఖాలకు .. కష్టాలకు అమితాబ్ బీవితం నిదర్శనం.

 

ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు దాటినా 70 ప్లస్ ఏజ్ వచ్చేసినా ఇప్పటికీ నటనపై మోజు తగ్గలేదు బిగ్ బీ కి. ఇంకా ఏదో చేయాలనే తపన.. దానికోసమే ఆరాటం ఆయనలో కనిపిస్తుంది. అందుకే బుడ్డా తేరా బాపు , పీంక్, త్రీ ... లాంటి ప్రయోగాలతో సైలెంట్ గా మార్కెట్ మీద దాడి చేస్తున్న అమితాబ్, ఇప్పడు తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ లో కత్తియుద్ధాలు, కర్ర సాములు చేస్తున్నాడట. పింక్, పీకూ, 102 నాట్ ఔట్.. ఇలా ఏమూవీ చూసినా తన స్టోరీ సెలక్షన్ అబ్జర్వ్ చేసినా, ఏజ్ కి తగ్గ పాత్రలు.... ఇమేజ్ కి మరింత మైలేజ్ ఇచ్చే ప్రయోగాలు... అంతవరకు ఓకే కాని సడన్ గా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేశాడట.

 

ఇక అమితాబ్ కెరీర్‌లో అవార్డులు, రివార్డులకి కొదువ లేదు. అమితాబ్‌కి నాలుగుసార్లు నేషనల్ అవార్డ్స్ వరించగా దాదాపు నలభైసార్లు బిగ్ బి పేరు నామినేషన్స్‌ కి దాఖలైంది. నటుడిగానే కాకుండా పలు చిత్రాల్లో పాటలు పాడి, కౌన్ బనేగా కరోడ్‌పతి, బిగ్ బాస్ లాంటి టీవీ షోలకు హోస్ట్‌ గా, చిత్ర నిర్మాతగా పలు హోదాల్లో పనిచేసి హమ్ కిసీసే కమ్ నహీ అనిపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బిగ్ బి అమితాబ్ బచ్చన్.

 

భారత ప్రభుత్వం 1984లో పద్మ శ్రీ, 2001లో పద్మ భూషణ్, 2015లో పద్మ విభూషణ్‌ అవార్డులతో అమితాబ్‌ని  సత్కరించింది. ఇక ఇండస్ట్రీ వైజ్ గా చూస్తే ఇప్పటి వరకు 15 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇవేకాకుండా బిగ్ బీ ప్రతిభను గౌరవిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన నైట్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్ వంటి పురస్కారాన్ని ప్రదానం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: