"చల్లకొచ్చి ముంత నింపుకొని, మరీ నీతులు చెప్పే, కొందరు నటీమణుల తీరు హాస్యాస్పదం"

దేశ వ్యాప్తంగా అటు బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్, మాలీవుడ్ చివరకు శాండల్-వుడ్ చిత్ర పరిశ్రమల నుండి సినీ నటీమణు లు తాము నిర్మాత దర్శకులు కథాయకుల చేత లైంగిక వేదింపులకు గురౌతున్నామని విచ్చల విడిగా తామర తంపర గా ఇప్పుడు బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. "ఇది కాల మహిమ లాగా కనిపిస్తుంది" 


బాలీవుడ్ అగ్రతార కంగనా రనౌత్,మాలీవుడ్ ప్రముఖ నటి భావన, కోలీవుడ్ తార కస్తూరి, వరలక్ష్మి, రాయ్-లక్ష్మి, రాధిక ఆప్టె ఇలా చెపుతూ పోతే ఈ వరస చాంతాడంత అవుతుంది. అవకాశాల కోసం నటీమణులు అడ్డదారి వెతికి అర్రులు చాస్తే, అవే తీర్చటానికి సినీ రంగ ప్రముఖులు అందిందే తడవుగా అవసరాలు ఆబగా సృష్టించుకొని తీర్చుకుంటారు. అవకాశాలున్న చోట ఆశలు, ఆశలున్న చోట అవసరాలు పుడుతూనే ఉంటాయి. "అవకాశాలు అవసరాలు కవలపిల్లలు"



నటి భావనపై పగ తీర్చుకోవటానికి కక్ష గట్టి చేసిన లైంగిక అరాచకం క్షమించరానిది. అందుకే ఆ కేసులో కథానాయకుడు చెరసాల పాలయ్యాడు. మిగిలిన కథానాయకల విషయంలో మాత్రం ఆశలు, ఆకాంక్షలు, అవకాశాలు, అవసరాల ఈక్వేషన్లు ప్రథానంగా చర్చకువస్తాయి. "మనం సరిగా ఉంటే ఈ విషయాలు వెను వెంటనే బయటకు వచ్చేవి"  ఇప్పుడు కంగన కాని రాధిక గాని కస్తూరి గాని బయట పడ్డంత మాత్రాన వారికి ఓరిగేది ఏమీ ఉండదు. "వార్తలలో సంచలనాలు తప్ప"


అందుకే ఆ రంగంలోని వారికి నాటి సాంప్రదాయవాదులు కొందరు పిల్ల నిచ్చి పెళ్ళిచేసే వారేకాదు. అది అక్కినేని నాగేశ్వర రావు గారి విషయములో కూడా జరిగిందని ఆయనే ఒక సందర్భంలో, ఒక రవీంద్రభారతిలో కార్యక్రమములో చెప్పారు. నాడు నటీమణులుగా రావటానికి సాంప్రదాయ కుటుంబాల వారు అంగీకరించలేని పరిస్థితి ఉండేది. నేడు ఆ రంగములో అనేక మంది "బహుముఖ ప్రఙ్జావంతులు వివిధ రంగాల నుండి ప్రత్యేక పాషన్" తో వస్తున్నారు. నేడు ఎవరూ ఎవరిని లైంగికంగా వేదించ లేరు "మనలో నిజంగా స్ట్రాంగ్ -విల్ ఉంటే" 

 

ఒకరు బయట పడితే మరొకరు. అంతే తప్ప తప్పు జరిగే సందర్భంలో చర్యలెందుకు తీసుకోలేదు. చట్టం ఉంది కదా! కేసులు పెట్టొచ్చుకదా! కాని అప్పటి ప్రాథమ్యం అవకాశం. ఇప్పుడు అవికోకొల్లలు. అందుకే "వేరొకరి నాటి అవసరాన్ని తప్పని" ఇప్పుడు బయటకు చెప్పుకొని బయట పెడితే "తమ భాగస్వామ్యం" లో తప్పులేదా? అసలు "ఆ భాగస్వామ్యమే ధర్మవిరుద్ధం, న్యాయవిరుద్ధం కనీసం చట్టవిరుద్ధం అనైనా గమనించాలి" కదా! 


మొదటి డిమాండ్ నే నిష్కర్షగా తిరస్కరిస్తే వీరంటే అవకాశవాదులకు భయం పుడుతుంది. మరోసారి అదే ఆలోచన వారికి వస్తే క్షమించ కూడదు. అంతా జరిగాక చెప్పుకుంటే రచ్చ రచ్చ తప్ప ఇంకేం మిగల్దు.  అంత కరక్ట్ గా ఉండాలంటే దారి తప్ప కుండా ప్రయత్నించండి. మీ లాగే కొందరు మంచి నిర్మాతలూ ఉంటారు.



'దుకాణం లో దొరికితేనే ఎవరైనా సరుకు కొంటారు'. చిత్ర రంగం చిత్రవిచిత్ర సంఘటనల సమాహారం. గతకాలంలో 'సినిమా' అంటే,  "సిగ్గు, నియమం, మానం" వదిలేసిన వారే అక్కడ చలామణి అవుతారని ప్రతీతి. అక్కడ రాయటానికి గొప్ప కథలు, చూడటానికి అద్భుత దృశ్యాలు తప్ప, మాట్లాడు కోవటానికి ఘనతలు ఏమీ ఉండవు. మహా ఐతే అద్భుత వినోదం దొరుకుతుంది. వినోదం వండి వార్చేవార్చే చోట "సృజనాత్మకతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది  "ఆడ ... మని + షి" తోనే వారికి రిలాక్సేషన్"  దొరుకుతుందని భావిస్తారు.

   

సృజనాత్మకతను వెండితెరపై సృష్టించటానికి  వారికి  మానసికోల్లాసం కావాలి. దాని వారు "రిలాక్సెషన్" చాలా అవసర మంటారు. కథలు చెప్పే రచయితలే కథలు రాసి దర్శకులు అవుతున్న వేళ - కథలు రాయాలంటే కొందరు దర్శకులు 'బాంకాక్' పోతారు. అక్కడే వారికి వారు ఇన్స్పిరేషన్ పొంది తద్వారా సృజనాత్మక భావనల నిలయాలౌతారు, ఐడియాలు వస్తాయి.


వెళ్ళేవారు ఊరికే వెళ్ళరు. స్వంత ఖర్చు కానప్పుడు మందు, విందు, పొందు అన్నీ పుక్కట్ గా సమకూర్చుకుంటారు. అవన్నీ అందించటానికి నిర్మాత "మని" అవకాశం కోసం షార్ట్ కట్ చూసుకునే  "షి" దొరుకుతారు. అలా కథ కథానాయకి అక్కడే సెటిలై పోతాయి.  ఆ రెండూ దొరకబట్టే వీళ్ళిప్పుడు కథలు చెప్పగలుగుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే లెక్కలు సరిపోతే అందరికీ శుభం. లెక్కల్లో తేడా వస్తే "లైంగిక వత్తిడి, లైంగిక దాడి, పక్కలోకి వస్తేనే ప్రయొజనం" అనె ఆరోపణలు.



ఈ సోది అంతా ఎందుకు? అయిపోయిన తరవాత గెలుక్కుంటే బయటకు చెపితే నటీ మణులపై చులకనతో, ఇంకొందరు  అవకాశాలు కొత్తగా సృష్టించటానికి చిత్ర రంగ ప్రవేశం చేస్తారు. నిజం మాట్లాడితే ఇలా అంతా నిష్టూరమే. గప్-చుప్ గా జరిగి పోయిన దానికి 'గత జల సేతు బంధనం' అంత అవసరమా?  అవకాశాల కోసం ఆబగా దొడ్డి దారులు వెతికే వారెందరు లేరు. నాటి మహా నటి నుండి నేటి తారామణుల వరకు. 


వాతావరణాన్ని కలుషితం చేసి శబ్ధ కాలుష్యం సృష్టించటం ఎమంత భావ్యం? వెలుపలికి వచ్చి సమాధానం చెప్పిన హ్రుతిక్ రోషన్ ఏమన్నాడు. ఆమే మా హోటల్ రూంలోకి ఫుల్లుగా తాగివచ్చిందని. అసలే అవకాశం కోసం మర్కటంగా మారిన మనిషి, ఆపై కల్లు తాగింది, నిప్పు తొక్కింది ఇంకేం పొందులో చిందేసి ఉండొచ్చు. అందుకే మనకు ప్రయోజనం చేకూర్చని విషయా లు "నిద్రలో జరిగినట్లు భావించి అంతా మర్చిపోతే మంచిదని" పరుచూరి సృజనాత్మక మాటల రచయిత తెలంగాణా శకుంత లతో "ఒక్కడు" సినిమాలో చెప్పకనే చెప్పించారు. అలాంటి నటీమణులు అది ఫాలో అయిపోతే మంచిది.


మహా పతివ్రతల శాతమెంత? అయినా వీరి పాతివ్రత్యాన్ని ఎవరు ప్రశ్నించారు?  వీరి నోటి దూల తప్ప. నిజాయతీపరుల శాతం అత్యల్పం. బహుస్వల్పం. అందుకే 'గత జల సేతు బంధనం' అవసరమా? అనుకొని వదిలేస్తెనే గౌరవమైనా మిగుల్తుంది. లేకుంటే మీ పొట్టలు చించుకుంటే మీ కాళ్ళ పైనే పడుతుంది. "ప్రజలకు విచ్చలవిడి వినోదానికి ముడి సరుకు అవ్వటం ఎవ్వరికీ శ్రేయోదాయకం కాదు" 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: