లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..!

Edari Rama Krishna
గత కొంత కాలంగా భారత దేశంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అన్నీ ఇన్నీ కావు.  ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని వార్తలు చదువుతూనే ఉన్నాయి.  అయితే ఈ లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు..సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు.  ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగానే చెప్పారు. 

ఆ మద్య మళియాళ నటి భావనపై జరిగిన లైంగిక వేధింపు అన్ని ఇండస్ట్రీ వారిని కదిలించింది. తాజాగా గాయని శ్రీపాద చిన్మయి మహిళల పట్ల జరిగే లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  నాకు తెలిసి ఏదో ఒకరంగా లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదనుకుంటానని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు.

హాలీవుడ్ నిర్మాత వైన్ స్టైన్ పలువురు నటీమణులను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఆయన బాధితురాలు  హాలీవుడ్ నటి అలిస్సా మిలానో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం ప్రారంభించింది.  దీనికి ఎంతో మంది సెలబ్రెటీల నుంచి స్పందన వస్తుంది.  తాజాగా గాయని చిన్మయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి చేసిన ట్వీట్లను చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా చిన్మయి లైంగిక వేధింపులపై సంచలన ట్విట్ చేసింది.  తన స్నేహితుల్లోని కొందరు మగవారిని వారి కన్నా వయసులో పెద్దవారైన పురుషులు లైంగిక వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. వేధింపులకు గురైన వారిలో మహిళలే కాదు, పురుషులు కూడా ఉన్నారనే విషయాన్ని చిన్మయి గుర్తుచేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. 
The #MeToo hashtag is heartbreaking. And as real as it gets. I dont know one woman who hasnt been groped / leched at / sexual assaulted in some way. I also have friends, grown men now, who have been raped by older men.

— Chinmayi Sripaada (@Chinmayi) October 16, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: