ఈ సీరియల్ కి అంత క్రేజా..!

Edari Rama Krishna
సాధారణంగా బుల్లితెరపై కొన్ని సీరియల్స్ చూస్తుంటే కొత్తలో మంచి క్రేజ్ లభించినా..రాను రాను ఆ సీరియల్స్ పై బోరు కొడుతుంది. గతంలో తెలుగు లో వచ్చిన చక్రవాకం, మొగళి రేకులు ఇలా కొన్ని సీరియల్స్ చాలా ఎపిసోడ్స్ వచ్చాయి.  కానీ జనాలకు ఏ మాత్రం బోర్ కొట్టలేదు.  కొన్ని సీరియల్స్ మాత్రం ఎందుకు వస్తున్నాయో తెలియని అయోమయ పరిస్థితి.

కానీ బాలీవుడ్ లో ఓ సిరియల్  ఒకటికాదు, రెండు కాదు, ఏకంగా 8 ఏళ్లుగా ప్రసారమవుతున్న  ‘యే రిక్ష్తా హై క్యా  కెహలాతా హై ’ అనే హిందీ సీరియల్‌ని జనాలు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఈ సీరియల్ 2500 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని ఎక్కువ ఎపిసోడ్ల సీరియల్‌గా రికార్డు సృష్టించింది. దీనికి ముందు ఈ రికార్డు ‘మెహతా కా ఉల్టా చష్మా’ సీరియల్ పేరుతో ఉండేది. అది  2300 ఎపిసోడ్లు ప్రసారమైంది.

సాధారణంగా ఇన్ని ఎపిసోడ్స్ వచ్చిన సీరియల్స్  కృత్రిమ సన్నివేశాలతో హడావుడిగా ముగిస్తుంటారు. యే రిక్ష్తా హై క్యా కెహలాతా’  రికార్డు నేపథ్యలో దాని నిర్మాత రాజన్ షాహి కేక్ కట్ చేసి పండుగ చేసుకున్నారు .ఈ దీపావళి పండుగ తమకు ఎంతో ప్రత్యేకమైనదని  తెలిపారు. ఈ సీరియల్ 2009 లో ప్రారంభమై ఇప్పటికీ నిరాటకంగా ప్రసారం అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: