పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆసిన్..!

Edari Rama Krishna

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు మురుగదాస్, హీరో సూర్య కాంబినేషన్ లో వచ్చిన ‘గజిని’ ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది.  ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆసిన్ ఇంట ఇప్పుడు సంతోషాలు వెల్లువిరిసాయి. గజినీ బ్యూటీ ఆసిన్‌కి పాప పుట్టింది. ఇవాళ ఉదయమే తమకి అందమైన చిన్నారి పుట్టిందని ఆసిన్, రాహుల్ శర్మ మీడియాకు తెలిపారు.  తమకు ఏంజిల్ లాంటి ఆడబిడ్డ పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.


గత తొమ్మిది నెలలు మా ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమని, ఆసిన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.   తెలుగు, తమిళ దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన ఆసిన్ ఆ తర్వాత మళ్లీ అదే గజిని సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  అమీర్ ఖాన్ సరసన చేసిన ఈ సినిమా ఆసిన్‌కి బాలీవుడ్‌లో హీరోయిన్ మంచి పేరు వచ్చింది..కానీ పెద్దగా చాన్సులు మాత్రం రాలేదు.


హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న ఆసిన్  మైక్రోమాక్స్ సంస్థ సీఈఓ రాహుల్ శర్మతో ప్రేమలో పడిన ఆసిన్ ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైంది. గతేడాది జనవరి 19న రాహుల్ శర్మ, ఆసిన్‌లకి వివాహమైంది. అక్షయ్ కుమార్, ఆసిన్ కలిసి నటించిన ఖిలాడి 786 సినిమా షూటింగ్ సమయంలోనే అక్షయ్ కుమార్ ద్వారా ఆసిన్, రాహుల్ శర్మలకి పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు పెద్దల ఆశిస్సులతో పెళ్లి చేసుకున్నారు.   


పాప పుట్టిన సందర్భంగా ఆసిన్, రాహుల్ శర్మకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. అక్షయ్ కుమార్ తమ పాపను ఎత్తుకున్న ఫోటోను రాహుల్ శర్మ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. 

One joy which is completely unmatched...congratulations to my dearest friends Asin and @rahulsharma on the arrival of their little angel 😁 pic.twitter.com/fLEwUtHNzD

— Akshay Kumar (@akshaykumar) October 25, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: