నలభీముడిగా మారిన రాజేంద్రుడు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో  కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన గత కొంత కాలంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తండ్రి, మామ పాత్రల్లో నటిస్తున్న హీరో రాజేంద్ర ప్రసాద్.  తాజగా సంజనారెడ్డి డైరెక్షన్‌ రాజ్ తరుణ్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘రాజుగాడు’.  ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ ఫొటోలలో నటకిరీటీ రాజేంద్రప్రసాద్ లుంగీ కట్టుకుని వంట చేస్తుంటే, పక్కన నిలబడి హీరో రాజ్ తరుణ్ చూస్తున్నాడు. ఇక ఈ ఫొటోలను ఫోస్ట్ చేసిన అనిల్ సుంకర ఆసక్తికరమైన కామెంట్‌ని కూడా జోడించారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారు సెట్‌లో ఉంటే నవ్వులకే కాదు, ఫుడ్‌కి కూడా లోటుండదు. ఆయన వండుతుంటే హీరో రాజ్ తరుణ్ ఆ ఫుడ్‌ని ఎలా చోరీ చేయాలా అని చూస్తున్నాడు’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. 

దీనికి వెంటనే స్పందించిన రాజ్ తరుణ్ ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి నటించడం  చాలా సంతోషంగా ఉంది. ఆయన వండుతున్న ఫుడ్‌ని చోరీ చేయాలని ప్రయత్నించేలోపే వడ్డించేశారు..’’ అంటూ రాజ్ తరుణ్ పోస్ట్ చేశారు.
Rajendra prasad garu set lo unte navvula ke kaadhu food ki kooda lotu undadhu. @itsRajTarun is supervising and checking how to steal. pic.twitter.com/pSWYmnDjS9

— Anil Sunkara (@AnilSunkara1) November 10, 2017It’s always a pleasure workin wid Rajendra Prasad Garu. Wanted to steal d food he cooked, but ee lope serve chesesaaru! Yummy! 😀 #Rajugadu https://t.co/MKjr7yxjGg

— Raj Tarun (@itsRajTarun) November 10, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: