లండన్ లో పవన్ కళ్యాణ్ కు ‘గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు’

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టి అధ్యక్షడు పవన్ కళ్యణ్ ‘గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు’ను అందుకున్నారు. ఇండో-యూరో పియన్ బిజినెస్ ఫోరం" పవన్‌ కు ఈ అవార్డును ప్రధానం చేసింది. నిన్న శుక్రవారం లండన్‌ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, "బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్‌" లో జరిగిన సభల్లో పాలు పంచుకున్నారు. 


పవన్ కల్యాణ్, "ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం - ఐఈబీఎఫ్" ప్రకటించిన "గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు"ను అందు కున్నారు. ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా ప్రజలను పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల మూలాలను గుర్తించాలని ఆ వ్యాధుల బారి నుంచి ఆ జిల్లా ప్రజలను విముక్తులను చేసేందుకు అవసరమైన చర్యలను సూచించా లని గతంలో పవన్ బ్రిటన్ శాస్త్ర వేత్తలను కోరిన సంగతి తెలిసిందే. ఓ సినీ స్టార్ గా ఉండి, వ్యాధి బారిన పడిన ప్రజల సంక్షేమం కోసం పవన్ పడుతున్న తపనను గుర్తించిన బ్రిటన్ శాస్త్ర వేత్తలు ఇదివరకే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.



ఈ విషయంలో పవన్ చూపిస్తున్న ప్రత్యేక చొరవను గుర్తించిన ఇండియా యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఐఈబీఎఫ్) ఆయనకు గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.  అవార్డు తీసుకోవడానికి ముందు పవన్ లండన్‌లోని బి.ఆర్. అంబేడ్కర్ మెమోరియల్‌ను సందర్శించారు. శనివారం యూరప్‌లోని వివిధ విశ్వవిద్యాల యాలకు చెందిన విద్యార్థులతో పవన్ సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం వెస్ట్ మినిస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లోని కింగ్స్ మెడికల్ కళాశాలలో జరగనుంది. దీంతో పవన్ రెండు రోజుల లండన్ పర్యటన ముగుస్తుంది.



ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మితమౌతున్న ఒక సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌కు జోడీగా కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి "అజ్ఞాతవాసి" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: