ఆ హీరో చాలా సీరియస్ గా అయ్యాడు..ఎందుకో తెలుసా..!

Edari Rama Krishna
ఈ మద్య సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది.  ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇదిగో తోక అంటే..అదిగో పులి అనే చందంగా తాయారైంది.  తాజాగా  బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ పై ఓ తాగుబోతు దాడి చేశాడని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.   బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రస్తుతం  `సందీప్ అండ్ పింకీ ఫ‌రార్‌` సినిమాలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సమయంలో ఓ తాగుబోతు అర్జున్ కపూర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అలాగే అతడిపై దాడి చేశాడని వార్తలు వచ్చాయి. 
పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని అరెస్టు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ను ప్ర‌ముఖ వెబ్‌సైట్లు కూడా పెద్ద పెద్ద ప‌దాలు వాడి ప్ర‌చురించ‌డంతో త‌న కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందార‌ని అర్జున్ క‌పూర్ తెలిపారు.

వాస్తవానికి షూటింగ్ లో అదో చిన్న గొడవ అంత మాత్రాన వెబ్ సైట్లు అన్నీ పని కట్టుకొని తమ సైట్స్ కి పాపులారిటీ రావాలని గాయాలు వంటి పెద్ద పెద్ద ప‌దాలు ఉప‌యోగించ‌డం స‌బబుకాద‌ని అర్జున్ హిత‌వు ప‌లికారు. ఈ మేర‌కు ఆయ‌న సంబంధిత వెబ్‌సైట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. వార్త రాసే ముందు సంఘ‌ట‌న గురించి కొంచెం ప‌రిశోధించి రాయాల‌ని సూచించారు.
How come I have no clue about this happening ?
The crowd here has been peaceful. There might have been a disturbance off camera but the local force has never let it reach till me. My entire family was in panic this morning so using words like assault isn’t cool just for effect. https://t.co/Qd8yFWWUd2

— Arjun Kapoor (@arjunk26) December 7, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: