మంచు అబ్బాయితో..శ్రియా ఎంజాయ్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు మంచు మోహన్ బాబు.  నటుడిగా, నిర్మాత, వ్యాపారతవేత్త,రాజకీయ నాయకుడిగా అన్ని రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేత ఏర్పరచుకున్న మోహన్ బాబు ప్రస్తుతం ‘గాయత్రి’ చిత్రంలో నటిస్తున్నారు.   ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మోహన్ బాబు నట వారసులుగా ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. 

అంతే కాదు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా చేస్తూనే..వెండితెరపై తన సత్తా చాటుతుంది.  మ‌ద‌న్ దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘గాయత్రి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.కాగా,  ఈ సినిమాకి సంబంధించిన ఓ స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

ఈ స్టిల్‌లో మంచు విష్ణు రావణాసురునిగా 10 తలలతో కనిపిస్తున్నారు.  ఇక రావణాసురుడు అయినా నాకేంటీ భయమా అన్నట్లు శ్రియ ఆ పదితలలో ఒకటి పట్టుకుని ఉంది..విష్ణు నవ్వుతూ “నీకు ఇదేం పని” అన్నట్లు నవుతున్నారు. వీరిద్దరూ కూడా డీ-గ్లామర్ లుక్‌లో సరదాగా కనిపిస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రసన్న ప‌తాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: