సన్నీలియోన్ వస్తే చంపేస్తాం.. లేదా.. చస్తాం..!! ఎందుకో తెలుసా...?

Vasishta

సన్నీలియోన్ ఈ పేరు చెబితే... చాలు కుర్రకారు గంతులేస్తుంది. సినిమాలో సన్నీ ఐటెమ్ సాంగ్ ఉందంటే చాలు థియేటర్లకు జనాలు క్యూ కడతారు. ఆమె కాల్షీట్ల కోసం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తారు. అంత క్రేజ్ ఉన్న సన్నీలియోన్... తమ ఊరు వస్తానంటే.. కొందరు మాత్రం వద్దంటే వద్దంటున్నారు. ఒక వేళ వస్తే ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు..

 

భారతీయులకు ఓ పోర్న్ స్టార్ గా పరిచయమైన సన్నీ లియోన్... 2011లో జిస్మ్2 సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమా నుంచే ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పటిదాకా బాలీవుడ్ హాట్  గాళ్స్ గా ఉన్న బిపాసాబసు, కంగనా రనౌత్, కత్రినా కైఫ్ వంటి వారిని పక్కకు నెట్టేసింది. అప్పటి నుంచి బాలీవుడ్ హాట్ రాజ్యానికి సన్నీ లియోన్ రాణిగా చెలామణి అవుతోంది.

 

బాలీవుడ్ లోనే కాదు దక్షిణాది యువకుల మనసుదోచింది సన్నీ. పలు దక్షణాది సినిమాల్లోనూ ఆమె నటించింది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ సినిమాలో తళుక్కున మెరిసింది. అప్పటి నుంచి ఆమెకు కన్నడ, తమిళ ఆఫర్లు కూడా వచ్చాయి. ఇటీవల ‘డీకే’ అనే కన్నడ చిత్రంలో సన్నీ అతిథి పాత్ర చేసింది. మొన్నటికి మొన్న గరుడవేగ సినిమాలో డియ్యో డియ్యో అంటూ కుర్రకారును ఉర్రూతలూగించింది.. సినిమాల్లోనే కాకుండా దేశంలో జరగుతున్న పలు ప్రైవేట్ ఈవెంట్ లోనూ సన్నీ లియోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 31న ఈవెంట్ భారీగా నిర్వహించాలని బెంగుళూరులో ఓ ప్రైవేటు సంస్థ సన్నీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కార్యక్రమానికి సంబంధించి ప్రకటనలు కూడా చేసింది.

 

 మరోవైపు సన్నీలియోన్ కి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళనలు మొదలయ్యాయి. నీలి చిత్రాల్లో నటించిన సన్నీతో ఈవెంట్  చేయవద్దని కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం హెచ్చరించింది. ఆమె బెంగుళూరులో నాట్యం చేస్తే ఖబడ్దార్ అంటూ....నగరంలోని మాన్యతా టెక్ పార్క్ ఎదుట ఆందోళన చేపట్టారు సంఘ కార్యకర్తలు. తమ సంస్కృతిని అవమానించడమేనంటూ సన్నీ ఫొటోలను తగులబెట్టారు. నూతన సంవత్సర వేడుకను ఆపకపోతే యువసేన సంఘం కార్యకర్తలు డిసెంబరు 31న ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు.

 

సన్నీ లియోన్ వల్ల కర్ణాటక సంప్రదాయానికి ఎంతమాత్రం విఘాతం కలగదని ఈవెంట్ నిర్వాహకుడు తెలిపాడు. ఓ కుటుంబ వేడుకలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పాడు. సన్నీ కన్నడ పాటకు మాత్రమే డ్యాన్స్‌ చేస్తుందని, సంప్రదాయ బద్దంగానే కార్యక్రమం సాగుతుందన్నాడు. నూతన సంత్సర వేడుకల కోసం సన్నీకి చాలా మంచి ఆఫర్లు వచ్చినా ఆమె బెంగుళూరుకు రావడానికి ఒప్పుకున్నారని తెలిపాడు. గత రెండు వారాల్లో సన్నీకి వ్యతిరేకంగా యువసేన ఆందోళన చేయడం ఇది రెండోసారి. కర్ణాటకలోని 20 జిల్లాల్లో కూడా భారీగా నిరసన చేపడతామని కార్యకర్తలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: