టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రానా. ‘లీడర్’ తో మంచి విజయం అందుకున్నా తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఏడేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో రెగ్యులర్ గా నటిస్తూ వస్తున్నాడు దగ్గుబాటి రానా. హీరో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా, కేవలం కమర్షియాల్ చిత్రాలతోనే కెరీర్ ని సాగించకుండా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.
బలమైన కథలు, వైవిధ్యమైన పాత్రకే ప్రాముఖ్యతను ఇస్తూ ఫిల్మ్ జర్నీ కొనసాగిస్తున్నాడు. అందుకే ఏడేళ్ల ప్రయాణంలో చేసింది తక్కువ చిత్రాలే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి సీరీస్ తో మనోడికి ఏకంగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం 1945 సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో తరువాత చేయబోయే సినిమాలను కూడ లైన్ లో పెట్టాడు.
బాలీవుడ్ క్లాసిక్ హాథీ మేరి సాథీ సినిమాను అదే పేరుతో రీమేక్ చేయనున్నాడు. 1971లో రాజేష్ ఖన్నా హీరోగా తెరకెక్కిన ‘హాథీ మేరే సాథీ’ సినిమా ఘనవిజయం సాధించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రంలోని రానా పాత్ర (బన్‌దేవ్) ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఏనుగు దంతాల మధ్య నిలబడి దాని తొండాన్ని పట్టుకుని చాలా సీరియస్ లుక్ తో కనిపిస్తున్న రానా..మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనిపిస్తుంది.
రానా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటం మరో విశేషం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా దీపావళికి సందడి చేయనుంది. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.