పవన్ కళ్యాణ్ ఇంతగా దిగజారి పోయారెందుకు? కాపీ సినిమా అఙ్జాతవాసిపై అపనమ్మకమా?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు అత్యంత తేలికగా జనసేన అధినేత, టాలీవుడ్ మెగా పవర్ స్టార్లోని పవరంతా ప్రజల ముందు తీసేశారు. ఒక్క సినిమా అఙ్జాతవాసికి రోజుకు ఏడు ఆటలకు అనుమతి ఇచ్చి అటు చంద్రబాబు మరీ కంజర్వేటివ్ గా ఐదు ఆటలకు అనుమతినిచ్చి ఇటు కేసిఆర్ పవర్ స్టార్ ను సంతృప్తి పరచారు. అంతవరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పవన్ కళ్యాణ్ స్నేహం చేసింది తన సినిమా అవసరాలు తీర్చుకోవటానికేనని స్పష్టమైంది.


తాను రాజకీయాల్లోకి వస్తానని, రాజకీయాలలోని అవినీతి అక్రమాన్ని అన్యాయాన్ని ఏమాత్రం సహించనని, రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని వేసిన పగటి వేషాలేనని కూసిన వన్నీ కారు కూతలేనని ఈ సంఘటనతో ప్రజలందకి స్పష్టమైంది. ఆఫ్త్రాల్ ఒక సినిమా,  కొన్ని ఎక్కువ షోలు వేసుకోవటానికి అనుమతి కోసం ఆయనతో ఉన్న సుధీర్ఘ విభేదాలు మరచి ఆయన్ని కలవటంతో పవన్ కళ్యాన్ స్థాయి తాజా రాజకీయనాయకుల కంటే చవకబారు రాజకీయనాయకుడేనని ఋజువు పరచాయి. ఇంత చిన్న ప్రయోజనాన్ని పొందటానికి తెలంగాణా ముఖ్యమంత్రిని పాదాల చెంత తన ఆత్మ గౌరవాన్ని ఫణంగా పెట్టిన పవన్ కళ్యాణ్ రేపు రాజకీయాల్లో కి వస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టరని గారెంటీ ఏమిటని కొందరు పవన్ కళ్యాణ్ ను నటుడుగా ఆరాధించే వాళ్ళే అంటున్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఇంతగా దిగజారాలా? 

ఇప్పుడు పవన్ జనంలోకి వెళ్ళి చెగువేరా జ్యోతీ రావ్ పూలే ఇలా గొప్పవాళ్ల పేరెత్తితేనే ప్రజలు అసహ్యించుకొనే నీచ స్థాయికి ఆయన ప్రతిష్ఠ గ్రాఫ్ పడిపోయింది. ఇలాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే "అవినీతిలో గాలి జనార్ధన్రెడ్డికి తక్కువ వైఎస్ జగన్ కు తక్కువ" అయిపోరా? ప్రతిపక్షములో ఉంటే సంవత్సరానికి ఏదో కొంత పాకేజి ఇచ్చి నోరు మూయించటం ఇద్దరు చంద్రు లకు అంత కష్టం మాత్రం కాకపోవచ్చు. "కుక్కకు బిస్కెట్టో? మాంసం ముక్కో? వేస్తే చాలు తోక ఊపుతూ పడిఉండేటప్పుడు" వాళ్ళు దాన్ని పవన్ కళ్యాణ్ కు వేసి సరిగానే ఉపయోగించుకున్నారు. ఆయన పరువు-ప్రతిష్ఠ మురుగు మూసీలో కలిపేశారు. 


ఇక ప్రజల్లొకి వచ్చి ఆయన ఏం మాట్లాడినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కొన్ని మీడియా సంస్థలు తమ టెలివిజన్ లో ఎన్ని షో లేసినా, పత్రికల్లో ఎంత రాసినా, వెంట్రుక ముక్కల్లా ఏరి పారేసేది ఖాయం. ఏరకం గాను జనసేన రాజకీయ రంగ ప్రవేశానికిది ధారుణ విఘాతమే. పవన్ కళ్యాణ్ స్థాయి తెలిసిన ప్రధాని నరెంద్ర మోడీ ఈయన్ని "కూర లో కరేపాకులా తొలి నుండీ పక్కన పెట్టేశారు" 


ఇంత చిన్న అవకాశానికే  "ఉభయ చంద్రుల చరణాల చెంతకు చేరటం"  అటు జనసేనకు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల కూ, ఆత్మగౌరవం అంతరించినట్లే. ఈ దిక్కుమాలిన ఈ ఐడియా ఎవడిచ్చాడో కాని పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యాన్ని పాత రేసేశాడు  బహుశ అంతరంగంలో ఉన్న కక్షతీర్చుకొని ఉంటాడు. ఇదిచాలు వైసిపి జగన్మోహన రెడ్డికి, ఎన్నికల సమరాంగణం లో బ్రహ్మాస్త్రం చిక్కినట్లే ఇక "ఒక ఆట, మూడు పార్టీలు" అనేలా ఆదేసుకోవటానికి ఆయన తయారవుతూ ఉండొచ్చు. 


దీంతో పవనెంత? ఆయన స్థాయెంత? ఆయన వ్యక్తిత్వం ఎంత? అనేదిప్పుడు చర్చనీయాం అవనుంది. కత్తి మహేష్ కు సరైన సమయంలో కరవాలం ఇచ్చినట్లే.  అసలే "పూనం కౌర్"  వ్యాఖ్యల్నే తన ఆయుధం గా మలుచుకొని పవన్ పై ప్రయోగించిన కత్తికి మరో పదునైన ఆయుధం దొరికినట్లే. 


ఇక కెసిఆర్ అస్సరమైనప్పుడు "నేనేసిన రొట్టెముక్కను తినటానికి తోకూపిన వ్యక్తి"  మీకేం చేయగలడని ఎన్నికల్లో ప్రశ్నించ గలరు. చంద్రబాబుకు ఏనాడైన భవిష్యత్తులో "మొగుడవగలడన్న పవన్ మొగుడు కాదు కదా, అసలు రాజకీయంగా మగాడే కాదని"  ఋజువు చేసుకున్నారు. 

విక్రముడు శవంలోని బెతాళుణ్ణి భుజాన వేసుకొని మోసు కెళ్ళినట్లు-పవన్ చంద్రబాబుని, జనసెన టిడిపిని మోయాల్సిందే. ప్రశ్నలెవరైనా వేస్తే పవన్ అభిమానులకు ఆయన గారి ఈ లీలతో నోరు మూయించవచ్చు. పాపం! పవన్ కళ్యాణ్!   
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: