'అఙ్జాతవాసి' పై విదేశీ చట్టం రూపంలో బాంబ్ పడనుందా?

లార్గో వించ్ ఫ్రెంచ్ సినిమా కొంత కథనో కొంత కథనాన్నో కాకుండా (సీన్ టు సీన్ కాదు లెండి)  ఆసాంతం కాపీ కొట్టి రూపొందించిన టాలీవుడ్ సినిమా ప్రముఖ ప్రఖ్యాత టాలీవుడ్ దర్శక అవక్ర త్రివిక్రముడు  త్రివిక్రం శ్రీనివాస్ సారధ్యంలో నిర్మించిన సినిమాకు ప్రభుత్వం నుండి అదృష్టం, శనిలా పట్టుకుంది..


ఈ సినిమాకి తెలుగుదేశం ప్రభుత్వం తన సార్వభౌమత్వాన్నే పవన్ కళ్యాన్ పాదాక్రాంతం చేసింది, పూర్తిగా దాసోహం అయింది.

రోజుకు ఏడు ఆటలు ఏడు రోజులపాటు ఆడించుకునే అవకాశం ఇచ్చింది. 
ఇష్టమొచ్చిన రేట్లకు టిక్కెట్ ధరలు నిర్ణయించుకునే అవకాశం పుష్కళంగా ఉంది.
ఇక బ్లాక్ లో టిక్కెట్ ధర ఒక్కింటికి ₹ 500/- నుంచి ₹ 2000/- వరకు పలికింది.
కావసినంత మీడియా ప్రచారం ద్వారా సినిమా పై "హైప్" తారస్థాయికి చేర్చారు. 
ఇక ప్రదర్శనకు కావలసినన్ని థియేటర్స్ చేతిలో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. 
బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఎలా అంటే  అలా దోసెల్లా వేసేశారు.

ఈ సినిమా ప్రదర్శనకు."ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణే సర్వస్వం" అనేలా ఏడు రోజులపాటు ప్రభుత్వాన్నే తాకట్టుపెట్టేశారు.  ఇంత అదృష్టం ఎవరికుంటుంది. అయినా "అఙ్జాతవాసి" కి ఏమూలో దరిద్రం దావానలంలా తగులుకుంది. అదేమంటే:

ఈ సినిమాపై మరో పిడుగుపడే అవకాశం ఉందట."కాపీ-కాట్ దర్శక శిఖామణి" కి అంతర్జాతీయంగా ఉన్న "కాపీ రైట్ చట్టాలు" తెలిసినట్లు లేదు. "లార్గో వించ్"  సినిమా భారతీయ హక్కులు ఈ సినిమా నిర్మాణానికి ముందే పొంది ఉన్న "టి-సీరిస్ సంస్థ" తో సినిమా నిర్మాణం తరవాత, దగ్గుబాటి రానా నాయకత్వంలో లాబీచేసి సెటిల్ చేసు కున్నట్లు సమాచారం.



ముందు దొంగతనంగా కథ కథనం నిర్మాణం వాడేశారు. "ఎవరూ చూడరని దొంగతనంగా పాలు తాగిన పిల్లిలా" ఎవరూ చూడక పోతే హాపీ! దొరికితే కదా! అనుకున్నారు. కాని ఇప్పుడు ప్రపంచం చిన్నకుగ్రామం నిముషాల్లో కరతలామలకం అయిన విఙ్జానం విశ్వమంతా వ్యాపించేస్తుంది. అదే జరిగింది అఙ్జాతవాసి విషయంలో. అయితే కాపీ రైట్ చట్టం ద్వారా వచ్చే ప్రమాధాన్ని ఊహించి టి-సీరిస్ కు  కొన్ని కోట్లిచ్చి సెటిల్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది


కాని....ఫ్రెంచ్ వాళ్ళు చాలా సౌమ్యులుగా కనిపించే కఠినాత్ములు. "లార్గో వించ్ దర్శకుడు జెరోం సల్లే" ఈ సినిమా కాపీ రైట్ చట్టాన్ని అతిక్రమించిందని తెలిసి సినిమా విడుదలై తాను తొలి రోజున్నే తొలి షో చూసేవరకు అహరాహరం ఎదుచూసి సినిమా చూశాకే నిద్రపోయాడట. అంతే కాదు మన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, సినిమా థియేటర్ల వద్ద మన జనసమూహాన్ని వాతావరణాన్ని తెగ పొగిడేశాడు. అప్పుడు మన వాళ్లంతా మన పవన్ కళ్యాణ్ ప్రపంచం మెచ్చిన నటుడనుకున్నారు.

కాని మనకు తెలియంది హాలీవుడ్ నటీ నటుల ముందు "హనుమ ముందు మర్కటం" లాంటి వాళ్ళమని. వాళ్ళు నటనకు ప్రాణాలిచ్చేస్తారు. మన కథానాయకులు ఒక దెబ్బకు ఒక ఊరినే కూల్చేస్తారు. కాని అక్కడ దృశ్యాలు యధార్ధానికి దగ్గరగా ఉంటాయని మనకు తెలియంది కాదు. అలాగే చట్టాలు కూడా!


టి-సీరిస్ వాళ్ళు ఈ సినిమా నిర్మాతకు భారతీయ హక్కుల్ని మాత్రమే యిచ్చింది. కాని సినిమా అంతర్జాతీయ ప్రదర్శన జరి గింది. ఒక్క అమెరికాలోనే 500 పైగా థియేటర్స్ లో ప్రదర్శన చేసేశారు. ప్రపంచం లో మన అఙ్జాతవాసి తప్ప విదేశాల్లో ఇన్ని థియేటర్స్ లో విడుదలైన తెలుగు సినిమా లేదు. ఇది పవన్ కళ్యాణ్ రికార్డ్ గా చెప్పుకుంటాం! బాహుబలి రికార్డులను అధిగ మించిందని పవన్ కళ్యాణ్ "దురభిమానులు" (సారీ! ఆయనకు అభిమానులు ఉండరట)  స్వకుచమర్ధనం చేసుకొని సుఖం పొందుతారట. 

అయితే ఇన్ని థియేటర్లు అన్ని థియేటర్లు అనే మనపిచ్చ పరాకాష్ఠకు చేరి  చివరికి మన కాపీ బాగోతం మన బాష కాని ఫ్రెంచ్ వాళ్ళకే కాదు విశ్వానికే విదితమైంది.  జెరోం సల్లే మేలు కొలపటంతో అంతర్జాతీయంగా లార్గో వించ్ డిస్ట్రిబ్యూటర్స్ అలర్ట్ అయ్యారట. అసలే లార్గో వించ్ ఒక ఫెయిల్యూర్ సినిమావాళ్ళు ఆర్ధికంగా నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అతి కఠినమైన చట్టాలను తిరగేస్తున్నారట ఈ చిత్రంపై చర్యలకు ఉపక్రమించటానికి. మన దేశలో కాకపోయినా, మన ఆంధ్రాలో ఐతే పవన్ కు ప్రభుత్వం దాసోహం అయిందిగాని ఆ దేశాల్లో మాత్రం ప్రభుత్వాలే చట్టాలకు దాసోహం అనకతప్పడు.

హెచ్-1 బి విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రథమ పౌరుడుగా తనను తాను భావిస్తాడు.  ఆయన్నే అక్కడి చట్టాలు ఏడు చెఱువుల నీళ్ళు తాగిస్తుంది. అందుకే "కాపీయింగ్ ఆఫ్ లాగో వించ్ ఈజ్ ఏ హాంగింగ్ స్వోర్డ్ ఆన్ ది హెడ్స్ అఙ్జాతవాసి"  అది గనక దెబ్బే కొడితే  మన అఙ్జాతవాసి నిర్మాతలు దర్శకులు కథానాయకులు  అఙ్జాతవాసం చేయాల్సిందే శంకరగిరిమాన్యాలు పట్టాల్సిందే. నష్టం రేంజ్ ఊహించలేమట. అందులోను అక్కడ చంద్రబాబు నాయుడు లేరు కాపాడటానికి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: