అజ్ఞాతవాసి 6 రోజుల కలక్షన్స్ రిపోర్ట్..!

shami
జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్, త్రివిక్రం కాంబినేషన్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ అజ్ఞాతవాసి. జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది అనుకుంటే బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డది. కథ కథనాల్లో త్రివిక్రం మార్క్ ఎక్కడ కనిపించలేదు.


సంక్రాంతి రాజుగా బాక్సాఫీస్ పై చెలరేగుతాడు అనుకున్న పవన్ కేవలం ఒకటి రెండు రోజుల కలక్షన్స్ తో సరిపెట్టుకోవడం షాకింగ్ గానే ఉంది. ఇక సినిమా కథపై వచ్చిన వివాదాలకైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని లార్గో వించ్ స్పూర్తి అని టైటిల్ కార్డ్ లో వేసినా కొద్దిమేరకు గౌరవంగా ఉండేదని అంటున్నారు. రోజు రోజుకి సినిమా కలక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి.


పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా 6 రోజుల కలక్షన్స్ షేర్ 52.50 కోట్లు. సినిమా ప్రీ రిలీజ్ బ్జినెస్ మాత్రం 125 కోట్లకు పైన చేసిందని తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే సగానికి పైగా లాసులు తీసుకు రావడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 32 కోట్ల కలక్షన్స్ సాధించింది. 


ఏరియాల వారిగా కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే :
నైజాం : 10 కోట్లు
సీడెడ్ : 4.75 కోట్లు
నెల్లూరు : 2.12 కోట్లు
గుంటూర్ : 4. 81 కోట్లు
కృష్ణా : 2.8 కోట్లు
వెస్ట్ గోదావరి : 4.2 కోట్లు
ఈస్ట్ గోదావరి : 3.5 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.7 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: