కొరటాల సూచనను తిరస్కరించిన మహేష్ !

Seetha Sailaja

మహేష్ వరస పరాజయాలతో దిగాలుపడ్డ అభిమానులు ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల నేపధ్యంలో మహేష్ నటిస్తున్న ఈమూవీలో ముఖ్యమంత్రిగా ప్రిన్స్ కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.

 

ఇది ఇలా ఉండగా ఈమధ్య కాలంలో విడుదల అవుతున్న టాప్ హీరోల సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతున్న నేపధ్యంలో టెన్షన్ పడుతున్న ఈసినిమా దర్శక నిర్మాతలు మహేష్ కు చేసిన సూచనను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కథలోని కొన్ని సీన్స్ రానా నటించిన ‘లీడర్’ సినిమాను పోలి ఉన్నాయి అని వార్తలు వచ్చిన నేపధ్యంలో దర్శకుడు కొరటాల శివకు ఒక ఆలోచన వచ్చినట్లు టాక్.

 

ఈ ఆలోచనతో ఈసినిమాను మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ కొరటాలల మధ్య ఒక కీలక సమావేశం ఈమధ్య జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ బాబు నటించి ఘన విజయం సాధించిన చాల సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కూడా ప్రధాన పాత్ర పోషించిన నేపధ్యంలో ‘భరత్‌ అనే నేను' సినిమా విషయంలో కూడ ఒక మాస్ ఐటమ్ సాంగ్ ను పెడదామని కొరటాల శివ మహేష్ కు సూచించినట్లు తెలుస్తోంది.

 

అయితే ఈ సూచనకు ఉలిక్కి పడ్డ మహేష్ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్ర్యతేక గీతం ఉంటే సినిమా డిస్ట్రబ్ కావడమే కాకుండా ప్రేక్షకులు కూడ అసహనానికి లోనవుతారని ఒక సందేశాత్మకంగా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐటమ్  సాంగ్ పెడితే చాలా నీచంగా ఉంటుంది అని మహేష్ కొరటాలతో గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈమధ్య కాలంలో టాప్ హీరోల నుండి ఎటువంటి సినిమాలను ఆశిస్తున్నారో టాప్ హీరోల అభిమానులకు కూడ క్లారిటీ లేని ప్రస్తుత పరిస్థుతులలో మహేష్ తీసుకున్న నిర్ణయం ఎంత వరకు ఈసినిమా విజయానికి ఉపయోగ పడుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: