మెగా అభిమానులకు జోష్ ను ఇచ్చిన కేటీఆర్ ట్విట్!

Seetha Sailaja
మెగా స్టార్ చిరంజీవి మ్యానియా జపాన్ లో కూడ తనకు కనిపించింది అంటూ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు చేసిన ట్విట్ చూసి మెగా అభిమానులు జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం జపాన్ దేశ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి చిరంజీవి ఫోటోను జపాన్ లో చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. 


జపాన్‌లోని షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే చిన్న పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను కేటీఆర్‌ సందర్శించారు. అయితే ఆ మ్యూజియంలో ఆయనకు మెగాస్టార్‌ చిరంజీవి ఫొటో కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఆఫోటోలను కూడ షోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారి మెగా అభిమానులను జోష్ లో ముంచెత్తి వేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ట్విట్ ఇలా కొనసాగింది. ‘మన మెగా స్టార్ చిరంజీవి ఫోటోను జపాన్ లోని ఒక చిన్న పట్టణంలో చూసి షాక్ అయ్యాను ఈ విషయం నాకెంతో ఆనందాన్నిస్తోంది’ అంటూ ట్విట్ చేసారు కేటీఆర్.Had a tour of the Suzuki museum at Hamamatsu in Shizuoka prefecture

The tour was great but guess whose picture I get to see there? Our own Mega Star Chiranjeevi Garu 😎

Felt nice to see someone from our motherland being recognised in a small town in Japan 👍 pic.twitter.com/927uGbmYnd

— KTR (@KTRTRS) January 18, 2018

జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కు అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవికి కూడ జపాన్ లో అభిమానులు ఉన్న విషయం కేటీఆర్ పెట్టిన ట్విట్ ద్వారా బయట పడింది. ఈ విషయాలు ఇప్పుడు మెగా అభిమానులతో పాటు మెగా అభిమానులకు కూడ తెలిసాయి కాబట్టి చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమాను జపానీ భాషలో కూడ డబ్ చేసి విడుదల చేసేరోజులు త్వరలో వస్తాయి అనుకోవాలి. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా చిరంజీవి మ్యానియాను కేటీఆర్ గుర్తించి లీక్ చేయడం బట్టి కళాకారులు సినిమా హీరోల క్రేజ్ ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతం అనే విషయం మరోసారి రుజువైంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: