నటులు కావాలని ఉందా..అయితే ఇది మీకోసమే..!

Edari Rama Krishna
ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్..నేనేంటో నిరూపిస్తా..అని సినిమాల్లో నటించాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ కొట్టే కామన్ డైలాగ్ ఇది.   వెండి తెరపై ఒక్కసారి కనిపిస్తే..జీవింతం మొత్తం రంగులమయంగా మారిపోతుందని యువతీ, యువకులు అనుకుంటారు.  ఇందుకోసం ప్రతిరోజూ స్టూడియోల చుట్టూ..సినీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక సినిమాల్లో నటించాలన్న తాపత్రయం ఉన్నవారి బలహీనతను కొంత మంది బ్రోకర్లు క్యాష్ చేసుకుంటారు..తమకు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్దలు తెలుసని వారితో పరిచయం చేయిస్తానని మోసం చేస్తూ డబ్బు గుంజుతారు.

ఒక అమ్మాయిల విషయం అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అయితే ఇలాంటి వారి మోసానికి చిక్కకుండా ఉండాలనే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ..ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. నటనపై ఆసక్తి గల వారికి శుభవార్త అందించింది.   తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ.. తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీతో కలసి నటనలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనుండి.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో 30 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఇందుకోసం ఆసక్తి ఉన్న వారు జనవరి 20, 21 తేదీలలో ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఈ విషయాన్ని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిక్షణా ఉపాధ్యాయుడు రమేష్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: