పవన్ కు తిలకం దిద్దిన అన్నా లెజ్నేవా - రాజకీయాలలో కలకలం !

Seetha Sailaja

‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ షాక్ నుండి వెంటనే తేరుకున్న తన రాజకీయ ఎత్తుగడల వేడిని  పెంచాడు. ఈరోజు ఉదయం పవన్ తన హైదరాబాదు నివాసం నుండి కరీంనగర్ జిల్లా కొండగుట్టుకు తన రాజకీయ యాత్ర నిమిత్తం ప్రయాణం అయ్యాడు. రాజకీయ యాత్రకు బయలుదేరిన ‘జనసేన’ అధ్యక్షుడు ఆయన భార్య అన్నా లెజ్నేవా వీరతిలకం దిద్ధి హిందూ సాంప్రదాయం ప్రకారం హారతి ఇవ్వడం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

 

దాదాపు 50 వాహనాల్లో వందలమంది అభిమానులు ‘జనసేన’ కార్యకర్తలు పవన్ ను అనుసరించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. రష్యన్‌ స్త్రీ అయిన లెజ్నేవా భారతీయ సంస్కృతి ఉట్టిపడే లా పవన్ కు హారతులు ఇవ్వడంతో అన్నా కూడ పవన్ ఆశయాలను భారతీయ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లుగా అనిపిస్తోంది.

 

ఆశ్చర్యకరంగా పవన్ తన జనసేన కార్యకలాపాలను తెలంగాణ ప్రాంతం నుండి ప్రారంభించడం వెనుక ఉన్న వ్యూహాల గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కొండగట్టు నుంచి తన యాత్రను ప్రారంభించిన పవన్ కొన్ని కీలక నిర్ణయాలు అక్కడ నుంచి ప్రకటిస్తారని అంటున్నారు. పవన్ ఈరాజకీయ యాత్ర తెలంగాణలో మొదలు పెట్టడంతో ఈయాత్ర ఉద్దేశ్యం కాంగ్రెస్ కు చెక్ పెట్టడానికా లేదంటే ప్రస్తుతం తెలంగాణాను పరిపాలిస్తున్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికా అన్న కోణంలో ప్రస్తుతం కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

ఈవిషయం పై కొందరి విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జనసేన అధినేత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, తన అభ్యర్థులను పోటీకి దించడం ద్వారా పరోక్షంగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూరుస్తారనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా పవన్ రాజకీయ ఎత్తుగడ వెనుక ఎదో ఒక కీలక అంశం అంతర్లీనంగా ఉంది అని అంటున్నారు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: