పవన్ యాత్ర పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja

పవన్ అభిమానులకు కత్తి మహేష్ కు ఏర్పడిన వివాదం ముగిసి రెండు రోజులు కూడ అవ్వకుండానే తిరిగి కత్తి మహేష్ యూటర్న్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించిన ప్రజాయాత్ర పై విమర్శకుడు కత్తి మహేష్ విలక్షణ కామెంట్స్ చేసాడు.

 

తెలంగాణ నుంచి పవన్ తన యాత్రను ప్రారంభించడం ఒక వ్యూహాత్మక తప్పిదమని కత్తి మహేష్ అభిప్రాయపడుతున్నాడు. ప్రశ్నిస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చిన ‘జనసేన’ అధినేత ఇప్పటివరకూ ఎత్తుకున్న సమస్యలెన్ని? ఎంతవరకూ తీర్చారు అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు కత్తి మహేష్.

 

ఒక ప్రముఖ ఛానల్ కు ప్రస్తుతం మహేష్ ఇస్తున్న లైవ్ టెలికాస్ట్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో మహేష్ ఈ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ఈ విమర్శకుడు పవన్ ను కామెంట్ చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోను ప్రభుత్వాలు చాల బాగా పనిచేస్తున్నాయి అని చెప్పిన పవన్ ఈ ప్రజా యాత్ర ద్వారా కొత్తగా ఏసమస్యలు తెలుసుకుంటాడు ? ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అన్న విషయం పై క్లారిటీ లేదు అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు కత్తి మహేష్.

 

ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కొండగట్టుకు చేరుకుంది. చేరుకున్న వెంటనే ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్లి పవన్ స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత ప్రత్యేక పూజలు చేశాడు. సాంప్రదాయం ప్రకారం ఆలయ పూజారులు పవన్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు కొండగుట్టలో ఆయనకు ఘన స్వాగతం పలకడమే కాకుండా అడుగడుగునా పవన్ కు జై కొడుతూ అభిమానులు చేస్తున్న హడావిడితో కొండ గుట్ట ప్రాంతం మారుమ్రోగిపోతోంది..   

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: