అందుకే చెంప చెల్లుమనిపించా : అనుష్క

siri Madhukar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘సూపర్ ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాతి కాలంలో అగ్రహీరోల సరసన నటించి బాగా పాపులర్ అయ్యింది.  మొదట్లో గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఎక్కువగా చేసిన అనుష్క ఆ తర్వాత నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.  కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రంలో జేజమ్మగా తన విశ్వరూపాన్ని చూపించింది.  ఆ తర్వాత ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ లాంటి సినిమాలో గ్లామర్ కాకుండా నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. 

ఇక బాహుబలి ఫస్ట్ పార్ట్ లో డీ గ్లామర్ గా కనిపించినా..బాహుబలి 2 లో అందాల మహరాణిగా  కనిపించింది.  ప్రస్తుతం అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా రిపబ్లిక్ సందర్భంగా రిలీజ్ కాబోతుంది.  ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవం గురించి చెప్పింది.  ఈ మద్య కొంత మంది ఆకతాయిలు సెలబ్రెటీలను ఇబ్బందులకు గురి చేయడం శోచనీయం అన్నారు.  గతంలో కూడా పలువురు హీరోయిన్ల పై ఇలాంటి లైంగిక వేధింపులు జరిగాయని..కానీ అవి బయటకు చెప్పుకోలేని పరిస్థితి అని అనుష్క ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ పబ్లిక్ ఫంక్షన్ కు వెళితే.. తనను అసభ్యంగా తాకాలని ప్రయత్నించారని.. ఆ టైంలో అతడ్ని చంపేయాలన్నంత కోపం వచ్చిందని చెప్పింది. కానీ.. అలా చేయలేమంటూ.. అందుకే అతడ్ని తాను కొట్టానని.. ఆ రోజు రాత్రి తనకు నిద్ర పట్టలేదంది అనుష్క. ఇటీవలే ఓ ఎయిర్ పోర్ట్ లో అదా శర్మ ను ముద్దివ్వాలని ఓ వ్యక్తి నాన్ సెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

దేశంలో 60 శాతం మంది కుటుంబ సభ్యుల ద్వారానే వేధింపులకు గురి అవుతున్నారంటూ రిపోర్ట్ లు వస్తున్నాయని  చెప్పింది. వేధింపుల గురించి బయటకు చెప్పేందుకు చాలామంది భయపడుతుంటారని.. అలాంటి పరిస్థితి ఎదురైతే ధైర్యంగా చెప్పేలా పేరెంట్స్ కు నేర్పించాలన్నారు. అప్పుడే వాళ్లు ధైర్యంగా బయటకు వచ్చి చెబుతారని చెప్పింది అనుష్క.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: