షాకింగ్ హెడ్ ఫోన్స్ లో భరత్ అను నేను !

Seetha Sailaja
టాప్ హీరోల మధ్య పోటీ పెరిగి పోవడంతో వారి సినిమాల విడుదలకు సంబంధించి  క్రేజ్ పెంచడానికి రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా విడుదలకు ముందు ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేసేవారు. అయితే మహేష్ లేటెస్ట్ మూవీ ‘భరత్  అను  నేను’ విషయంలో ఇప్పుడు ఫస్ట్ ఆడియో కూడా వచ్చేస్తుంది. ఈకొత్త తరహా ప్రయోగానికి దర్శకుడు కొరటాల శివ తెర తీస్తున్నాడు.
  
 ‘get ready to listen to Mahesh Oath on 26Jan’  అంటూ కొరటాల ట్విట్ చేసాడు. ఈ ట్విట్ వచ్చిన కొన్ని గంటలకే ఇది వైరల్ గా మారి మహేష్ అభిమానులకు హాట్ న్యూస్ గా మారడమే కాకుండా గూగుల్ ట్రెండింగ్స్ లో ఈ విషయం రెండవ స్థానంలో నిలవడం సంచలన వార్తగా మారింది. మరో మూడు రోజులలో రిపబ్లిక్ డే నాడు విడుదల కాబోతున్న ఈమూవీ ఫస్ట్ లుక్ మ్యానియా అప్పుడే ప్రారంభం అయిపోయింది.

Superstar Mahesh Babu's #MB24, directed by Siva Koratala, will take the First Oath this Republic Day!#MB24FirstOathOn26Jan pic.twitter.com/qYgjTnRtXh

— DVV Entertainment (@DVVEnts) January 15, 2018


దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను ప్రస్తుతం కొరటాల చేస్తున్నాడు. ఈ సినిమా పేరును ఇంత వరకు అధికారికంగా ప్రకటించని నేపధ్యంలో జనవరి 26న ప్రకటించబోతున్న   ఈ సినిమా టైటిల్ కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకుసంబంధించి టైటిల్ లోగోతో పాటూ మహేష్ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను కూడా విడుదల చేయబోతున్నారు.  దీనితో అభిమానులంతా సిద్ధంగా ఉండాలంటూ దర్శకుడు కొరటాల శివ కోరుతున్నాడు. 

ప్రస్తుతం కొరటాల ట్విట్ కు వస్తున్న స్పందన చూస్తూ ఉంటే ‘భరత్ అను నేను’ ఆడియో కూడా రికార్డు నెలకొల్పడం ఖాయంలా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా రిపబ్లిక్ డే నుంచి మహేష్ మ్యానియా మొదలు కావడం ఖాయం అని అంటున్నారు.  వరస పరాజయాలతో మహేష్ కెరియర్ కొనసాగుతూ ఉన్నా ఈసినిమాకు జరుగుతున్న భారీ బిజినెస్ మహేష్ స్టామినాను సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: