వసూళ్ళ సునామీ - స్పీడ్ తగ్గని భాగమతి

"దక్షిణభారత లేడీ సూపర్ స్టార్" అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన "భాగమతి" చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్దబ్రహ్మాండం గా కనకవర్షం కురిపిస్తూ కొనసాగుతుంది. మొదటి రోజు 2.77 లక్షల డాలర్లను, రెండవ రోజుకు మొత్తం 5.19 లక్షల డాలర్లను అందుకున్న ఈ సినిమా ఆదివారం కూడా అదే స్థాయిలో రాణించి మూడు రోజులకు కలిపి 7 లక్షల డాలర్లను తన కిట్టీలో వేసుకుంది. ఆరంభం కంటే అంతకంతకూ వసూళ్లు పెరుగుతున్నాయని ట్రేడ్ జనాలు చెబుతున్నారు. ఈ సినిమా వసూళ్ళ వేగం దీన్నిబట్టి అర్ధమవుతుంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భాగమతి బాగా ఆడుతుంది. 


నిజానికి ప్రీమియర్ షోల ద్వారా భాగ్మతి ఆశించిన మేరకు పెర్ఫామ్ చేయలేదు. కానీ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన మౌత్ టు మౌత్ టాక్ మాత్రం ఈ సినిమా పర్ఫార్మాన్స్ ను బాగా ఎలవేట్ చేసి సినిమా ప్రమోషణ్ కు బాగా హెల్ప్ అయింది. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు వసూళ్లు 2.79 లక్షల డాలర్లను ఆర్జించిన భాగమతి, రెండో రోజున 2.63 లక్షల డాలర్లు గడించింది. ఆదివారంనాడు 1.60  లక్షల డాలర్లు వసూళ్లు కావడంతో, సినిమా స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది. 

ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే దీంతో చిత్ర రెండు  లేదా మూడు రోజుల్లో మిలియన్ డాలర్ మార్కును అధిగమించి ఇప్పటి వరకు కేవలం  స్టార్  హీరోల వరకే పరిమితమైన  "మిలియన్ డాలర్ మార్క్ రికార్డు" ను అందుకున్న తొలి తెలుగు హీరోయిన్ అనుష్క ఉరఫ్ స్వీటీయే కానుంది. ఇదే సాధ్యమైతే మాత్రం అనుష్క కొత్త రికార్డు సృష్టించినట్లే. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సైతం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం రూ.12 కోట్లవరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

"ఫిమేల్ సెంట్రిక్ మూవీ" తో "మిలియన్ డాలర్లు మార్క్" సాధించిన రికార్డ్ ఆమె సొంతమై చరిత్ర సృష్టించగలదని అనుష్క కెరీర్ లో లీడ్ రోల్ తో మిలియన్ డాలర్లను గడించిన మొదటి సినిమాగా భాగమతి రికార్డుల్లోకి ఎక్కేస్తుంది. రెండో వీకెండ్ ముందునే భాగమతికి ఈ రికార్డు సొంతం కావచ్చనే అంచనాలున్నాయి. 


బాహుబలి-2 చిత్రంలో దేవసేనగా అశేష భారతీయ ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది అనుష్క.  ఈ విజయంతో ఆమె తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు అప్పటి నుండే ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో అనుష్క"హారర్ థ్రిల్లర్" భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అశోక్ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్స్‌ దశ నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిం చిన ఈ చిత్రం ఈ నెల 26 న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఒక్క తెలుగులోనే తొలిమూడు రోజు ల్లో  30 కోట్లకు పైగా గ్రాస్-వసూళ్ళను సొంతం చేసుకొని పరిశ్రమలోనే  "ఫిమేల్ సెంట్రిక్ మూవీ" ల కలక్షణ్లలో సరి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇందులో 10 కోట్ల వసూళ్లు నైజాంలో రావడం విశేషం. మరి కొన్ని రోజుల్లో భాగమతి సునాయసంగా యాభై కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకోగలదని టాలీవుడ్ ట్రేడ్ పండితుల  అంచనా.

మహిళా ప్రధాన చిత్రం తొలి మూడు రోజుల్లో ₹ 30 కోట్లు సాధించడం దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోనే సరికొత్త అధ్యాయమని చెబుతున్నారు. అదేసమయంలో మహిళా ప్రధాన చిత్రాల్లో తొలిసారిగా ₹ 50 కోట్ల క్లబ్‌లో (శాటిలైట్ హక్కులతో కలిపి) చేరబోతున్న తెలుగు చిత్రంగా భాగమతి అరుదైన ఘనత ను సొంతం చేసుకోబోతుందని అంటు న్నారు. గత వారంలో ప్రేక్షకులు ముందుకొచ్చిన విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలైన "భాగమతి" అలాగే ఉత్తర భారతం లో "పద్మావత్" బాక్సాఫీస్‌కు సరికొత్త భాష్యాన్నిచెబుతూ వసూళ్ల వర్షం సృష్టిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: