రాజీవ్ కనకాల ఇంట విషాదం..!

Edari Rama Krishna
ఈ మద్య  వెండితెర, బుల్లితెరపై వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  గత నెలలో తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కాలం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుల్లితెర, వెండితెర నటుడు రాజీవ్ కనకాల ఇంట విషాదం నెలకొంది.  ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

లక్ష్మీదేవి భర్త దేవదాస్‌ కనకాల కూడా నటుడు అన్న విషయం తెలిసిందే. లక్ష్మీదేవి 11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించారు.  నాట్యకారిణిగా, నటిగా కళామ్మ‌ తల్లికి సేవలు అందించారు. మొద‌ట‌ మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో 1971లో నటుడు దేవదాస్ కనకాలను వివాహం చేసుకున్న లక్ష్మీదేవి ఆ తరువాత వారి సొంత ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కూడా పలువురికి శిక్షణను ఇచ్చింది. 

లక్ష్మీదేవి భర్త దేవదాస్‌ కనకాల నటుడుతో పాటు ఫిలిం స్కూల్ కూడా నిర్వ‌హిస్తున్నాడు. లక్ష్మీదేవి పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో, కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్‌ తల్లి పాత్రలో , ప్రేమ బంధం, ఒక ఊరికథ, పోలీస్  తదితర సినిమాలలో పలు పాత్రలలో నటించింది లక్ష్మీదేవి. 

కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు.సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు.


మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి --> https://bit.ly/2nxf0bg


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: