స‌ల్మాన్ ఖాన్ హ్యాపీ న్యూస్..!

frame స‌ల్మాన్ ఖాన్ హ్యాపీ న్యూస్..!

siri Madhukar
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అంటే అభిమానించే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు.  గత సంవత్సరం ట్యూబ్ లైట్ సినిమా డిజాస్టర్ అయినా..ఇటీవల టైగర్ జిందాహై సినిమాతో ఘనవిజయం సాదించారు.  ప్రస్తుతం సల్మాన్ ఖాన్ జోష్ బాగా పెంచారు. ప్రస్తుతం రేస్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమా కంప్లీట్ కాగానే సల్మాన్‌ ‘భారత్‌’ సినిమాలో నటించబోతున్నారు.   
Image result for salman khan kick

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ‘టైగర్‌ జిందా హై’ తరువాత సల్మాన్‌-అలీ అబ్బాస్‌ కాంబినేషన్‌లో రాబోతున్న రెండో  సినిమా. ఈ సినిమాలో మరో స్పెషల్ ఏంటేంటే..సల్మాన్ ఖాన్ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించబోతున్నారు. అంటే ఆయన వయసుకు సగం అన్నమాట. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మరో హ్యాపీ అనౌన్స్ మెంట్ వచ్చింది. 
Image result for salman khan kick

సాజిద్ న‌డియావాలా ద‌ర్శ‌క‌త్వంలో కిక్ 2 రాబోతుంది. ఈ చిత్రాన్ని 2019 క్రిస్మ‌స్‌కి విడుద‌ల చేయ‌నున్నారు.  గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ర‌వితేజ నటించిన కిక్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమా సీక్వెల్ కిక్ 2 తెరకెక్కించారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు.  ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అదే పేరుతో నటించారు. బాలీవుడ్ లో కిక్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

కిక్‌లో సల్మాన్ స‌ర‌స‌న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, కిక్ 2లో ఎవ‌రిని సెల‌క్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సల్మాన్ త‌న సొంత ప్రొడ‌క్ష‌న్‌లో చెల్లెలి భ‌ర్త ఆయుశ్ శ‌ర్మ హీరోగా ల‌వ్ రాత్రి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అభిరాజ్ మినవాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో వ‌రీనా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. 
Here comes the BIGGG announcement... Salman Khan and Sajid Nadiadwala join hands for #Kick2... Directed by Sajid Nadiadwala... Christmas 2019 release... #DevilIsBack pic.twitter.com/J35C1AZtN7

— taran adarsh (@taran_adarsh) February 7, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: