బాలీవుడ్ హీరోకి గాయాలు..!

Edari Rama Krishna
తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో విలన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు విద్యుత్ జమ్వాల్.  ప్రస్తుతం బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు విద్యుత్ జమాల్. దక్షిణాది చిత్రాల్లో సోపోర్టింగ్  నటుడిగా నటించిన విద్యుత్ జమాల్ బాలీవుడ్లో హీరోగా తెరకెక్కిన సినిమా కమాండో. ఈ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న కమాండో 2 కూడా మంచి విజయం సాధించింది. 

ప్రస్తుతం ఈ హీరో జంగ్లీ అనే చిత్రంలో నటిస్తుండగా.. అందులో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ప్రమాదం జరగడంతో అందులో విద్యుత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద ప్రమాదం తప్పింది.   దీంతో ఆయన ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు.

ఫోన్లు, సోషల్ మాద్యమాల్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. "ప్రస్తుతం నాకు బావుంది. రక్తస్రావం ఆగిన వెంటనే షూటింగ్ మళ్లీ ప్రారంభించాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్" అంటూ ట్వీట్ చేశారు. తెలుగులో తుపాకి, శక్తి , సికిందర్ చిత్రాలతో విద్యుత్ జమ్వాల్ తెలుగు వారికి దగ్గరైన విషయం తెలిసిందే.
I'm much better. Kickin it all the way! Once the bleeding stopped, we resumed our shoot that very same day! Thank you for all your love!!! #BornJunglee https://t.co/eRx7DrmEcr

— Vidyut Jammwal (@VidyutJammwal) February 9, 2018 Watch @VidyutJammwal pay respects to his tusker friend Bhola as he seeks blessings from the mighty animal for his upcoming flick, #Junglee, a #chuckrussell directorial and a @JungleePictures production! pic.twitter.com/g8LoCqCsEQ

— @bollyworm (@bolly_worm) February 4, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: