‘సైరా’కి స్వరాలు ఇళయరాజా ఇస్తున్నారా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన విషయం స్వయంగా ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన చిరంజీవి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.  కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.  విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్ హవా తగ్గిపోయింది.  ఇక మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆయన వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. 

అప్పటి వరకు చిరంజీవిపై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.  పది సంవత్సరాల తర్వాత ఆయన స్టామినా ఆ గ్రేస్ చూపించగలరా అని..! కానీ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం రిలీజ్ తర్వాత అందరూ షాక్..చిరంజీవి పది సంవత్సరాల క్రిత ఎలా ఉన్నారో..ఇప్పుడూ అదే పవర్..స్టామినా చూపించారు.  దాంతో అభిమానులు, విమర్శకులు ఆయకు బ్రహ్మరథం పట్టారు..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.  అయితే ఈ సినిమా ఎంట్ర టైనన్ మెంట్ తో పాటు రైతులకు సంబంధించిన మెసేజ్ ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది. 

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు  చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. చిరు సరసన నయునతార నటిస్తోంది.  ఈ చిత్రానికి మొదట ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తారని అనుకున్నారు..కానీ అది క్యాన్సిల్ అయ్యింది. అతని స్థానంలో ఎం.ఎం.కీరవాణి పేరు కూడా వినిపించింది.

తాజాగా ఇళయరాజాను చిరంజీవి ఇటీవల కలిసారని తెలుస్తోంది.  అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ కి ఎస్ తమన్ సంగీతం అందించారు.  ఆ తర్వాత ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు  ఇళయారాజా సంగీతం అందించే అవకాశం ఉన్నట్టు సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభైమెంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: