ప్రభాస్ పెళ్లి పై వరుణ్ తేజ్ కామెంట్స్ !

Seetha Sailaja

తొలిప్రేమ’ మూవీ అంచనాలకు మంచి సూపర్ సక్సస్స్ అవ్వడంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోష్ పై ఉంటూ ఈ మూవీ సక్సస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న  కలెక్షన్స్ చాలా బాగుండటంతో ఈమూవీ  కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం డ్రాప్ రాకుండా వరసపెట్టి మీడియా సంస్థలకు  ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ ఇంటర్వ్యూలలో తన  పర్సనల్ విషయాల్ని కూడా షేర్ చేస్తూ చేసుకుంటున్నాడు.

 

ఇందులో భాగంగా తన లవ్ లైఫ్, పెళ్లికి సంబంధించి న విషయాల పై అసక్తకర కామెంట్స్ చేసాడు ఈమెగా యంగ్ హీరో ‘ప్రస్తుతానికి నా లైఫ్ లో లవ్ లేదు. నా కెరీర్ తోనే నేను ప్రేమలో ఉన్నాను. మరో సక్సస్ వచ్చింది కదా, కెరీర్ పై ప్రేమ ఇంకా పెరిగింది.  నేను బయటకు  వెళ్ళుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని ఇంట్లో అడగరు.  కానీ నే నేంటో వాళ్లకు తెలుసు. ప్రేమ సంగతి పక్కనపెడితే పెళ్లికి చాలా టైం ఉంది’ అంటూ పెళ్లి పై తన అభిప్రాయాలను షేర్ చేసాడు . ఇదే సందర్భంలో మరో ట్విస్ట్ ఇస్తూ ప్రస్తుతానికి తన మైండ్ లో పెళ్లికి సంబంధించిన ఆలోచనలు లేవని తనకంటే ముందు నితిన్, ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని అంటూ ఆ హీరోలు ఇద్దరికీ సలహాలు ఇస్తున్నాడు.

 

‘నితిన్, ప్రభాస్ అన్న ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా వాళ్లే నాకు ఇన్సిపిరేషన్. ఇప్పటివరకు పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించలేదు. అదొక వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా చేసుకోవాలి కదా ఏదో ఒక రోజు చేసుకుంటా మెంటల్లీ నేను ఫిక్స్ అయినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా’ అంటూ ప్రభాస్ పెళ్ళికి తన పెళ్ళికి లింక్ పెట్టుకుంటున్నాడు. ఇది ఇలా ఉడగా ‘తొలిప్రేమ’ వరల్డ్    వైడ్ గా 26 కోట్లు వసూలు చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

 

ఈసినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు వెంకీ అట్లూరి పై టాప్ యంగ్ హీరోల దృష్టి పడటంతో కేవలం ఒకే ఒక్క సినిమాతో క్రేజీ డైరెక్టర్స్ లిస్టు లోకి చేరిపోయాడు. వరుణ్ తేజ్ కి ‘తోలిప్రేమ’ అందించిన సక్సస్స్ తో ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాతల దృష్టిలో వరుణ్ తేజ్ క్రేజీ హీరోగా మారాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: