కొత్తదనంతో ‘అ’..కత్తి రివ్యూ..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హీగానే కాదు నిర్మాతగా కూడా తన సత్తా చాటబోతున్నాడు.  ఏదైనా ఓ విచిత్రమైన కథనో..సంఘటనో మనకు తారస పడితే.. అ! అంటూ ఆశ్చర్యపోతాం..ఇదే కాన్సెప్ట్ తో నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ..నాని కొత్త కథ వినిపించాడట. దాంతో నాని నిజంగా ఆశ్చర్యంతో ‘అ!’ అనడమే కాదు..ఏకంగా ఈ చిత్రానికి తానే స్వయంగా నిర్మించాలనే ఒపీనియన్ కి వచ్చాడు. ఈ మద్య ఇండస్ట్రీలో  ఏ సినిమా వచ్చినా..సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఇచ్చే రివ్యూ ని ఎంతో  ఆసక్తితో చూస్తున్నారు జనాలు.

ఇప్పటివరకు తెలుగులో ఇటువంటి సినిమా రాలేదనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే ఆధారంగా నడిచే సినిమాలు చాలా వచ్చాయి. కానీ ‘అ!’ వాటన్నింటికంటే ప్రత్యేకమని చెప్పాలి అంటున్నారు కత్తి. తెలుగులో కొత్తద‌నం నిండి ఉన్న సినిమాలు వ‌స్తున్నాయ‌ని అంద‌రూ అనుకుంటున్న త‌రుణమిది. ‘‘అ! సినిమా ఓ మూస ధోరణిని బ్రేక్ చేసింది. బ్రిలియంట్ కథనం, నటనతో సినిమాను వదిలారు.

ఈ సినిమాను అద్భుతంగా రావడానికి ప్రతి ఒక్క టెక్నీషియన్ ది బెస్ట్‌గా ప్రయత్నించారు. ఇలాంటి కొత్తదనంతో కూడిన సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు నాని స్పెషల్ అభినందనలకు అర్హుడు’’ అని మహేష్ పేర్కొన్నారు.



They say, half of acting is actually reacting. In the movie "AWE" most difficult acting for sure is of @priyadarshi_i. Because he had to act mostly against two imaginary characters being 'voiced' by Nani as fish and Ravi Teja as plant. Way to go bro! https://t.co/V09EUICV9E

— Kathi Mahesh (@kathimahesh) February 16, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: