ప్రియా ప్రకాష్ వారియర్‌కు సుప్రీంకోర్టులో ఊరట..!

Chakravarthi Kalyan

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒక్కసారి కన్నుగొట్టి ప్రపంచానికి పరిచయమైపోయింది. ఇక దేశంలో కుర్రకారును ఊపేసింది.. ఇప్పుడు చివరకు సుప్రీకోర్టు మెట్లక్కేసింది.. కనుసైగలతో ఇంటర్ నెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ నటి ప్రియాప్రకాశ్ వారియర్ సుప్రీంకోర్టు మెట్లక్కింది.  తనపై తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో నమోదైన కేసులను కొట్టి వేయాలని ప్రియా పిటీష్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు... నేడు విచారణ చేపట్టనుంది. ఆయా ఫిర్యాదులకు సంబంధించి తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాల్సిందిగా ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.


ఈమేరకు ఆమె తన న్యాయవాది ద్వారా సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రియా వారియర్ నటించిన ‘ఒరు అదుర్ లవ్ ’ చిత్రంలోని ఓ పాటలోని అంశాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఆ చిత్ర దర్శకుడిపై కూడా హైదరాబాద్ లో కేసు నమోదైంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులు వచ్చాయి. ఆమె తన వ్యాజ్యంలో ఆ పాటపై వివరణ ఇచ్చారు.


 1978 నాటి ఓ పాత జానపద గీతం నుంచి పాటను తీసుకున్నామని.. అందులోని భావాలను అర్ధం చేసుకోకుండా, లోతుల్లోకి వెళ్లకుండా, వక్రీకరించి ఎవరో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఫిర్యాదులతో భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం కలుగుతుందన్నారు.  కాగా, ప్రియా ప్రకాష్ వారియర్‌కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ప్రియాతో పాటూ సినిమా డైరెక్టర్, నిర్మాతపై నమోదైన కేసులపై స్టే విధించింది. వారిపై ఎక్కడా కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: