GST సినిమాలో వర్మకు 'టీ బ్రేక్'..!! ఊపిరి పీల్చుకున్న వర్మ..!!

Vasishta

రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. GST విషయంలో ఎక్కడలేని చిక్కులను తెచ్చిపెట్టుకున్న వర్మపై ఓ వైపు పోలీసులు, మరోవైపు మహిళా సంఘాలు ఉచ్చు బిగుస్తున్నాయి. దీంతో వర్మకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్విస్ట్ లో కొంచెం రిలీఫ్ దొరికింది వర్మకు.!


తాను తీసుకున్న గోతిలో తానే పడతాడనేది సామెత. సరిగ్గా ఇప్పడు రాంగోపాల్ వర్మకు ఇదే వర్తిస్తుంది. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ - GST.. వర్మకు ఎక్కడలేని చిక్కులు తెచ్చిపెడుతోంది. తమ గౌరవాన్ని కించపరిచాడంటూ మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో సీసీఎస్ పోలీసులు వర్మను విచారించి.. ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అయినా.. పలు చోట్ల ఇంకా మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు జైలు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్- GST ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై ఇప్పటికే సామాజికవేత్త దేవి, ఐద్వా సంయుక్త కార్యదర్శి మణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. RGVని CCSలో విచారించి ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. మూడున్నర గంటలు విచారించిన పోలీసులు పలు ప్రశ్నలకు వర్మ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. తర్వాత రెండో సారి విచారణకు హాజరు కావాలని వర్మకు చెప్పారు పోలీసులు.


ఇదిలా ఉంటే.. వర్మ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.  వర్మను వెంటనే అరెస్టు చేయాలంటూ విశాఖ GVMC దగ్గర మహిళా సంఘాలు రెండు రోజులుగా  నిరాహార దీక్షలు చేస్తున్నాయి. అటు.. GSTని వ్యతిరేకిస్తూ పోరాడిన మహిళలే టార్గెట్ గా వర్మ ట్వీట్లు చేస్తున్నారని BJP నాయకురాలు తుమ్మల పద్మ విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయితే రాంగోపాల్ వర్మ శుక్రవారం మరోసారి విచారణకు హజరు కావాల్పి ఉంది. అయితే.. వర్మ ల్యాప్ టాప్ విషయంలో ఇంకా FSL రిపోర్ట్ అందకపోవడంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు. మార్చి ఫస్ట్ వీక్ లో విచారణకు రావాలని సూచించారు. దీంతో వర్మకు ఊరట లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: