అప్పుడు మా నాన్న కొట్టాడు : వరుణ్ తేజ్

siri Madhukar
టాలీవుడ్ లో మెగాఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు..వస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదగడానికి ఎన్నో కష్టనష్టాలకు ఒర్చుకున్నారు..స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు.  ఆయన వేసిన బాటలో ఇప్పుడు వస్తున్న హీరోలు తమ సొంత టాలెంట్ తో ప్రేక్షకాధరణ పొందుతున్నారు.  మెగాస్టార్ తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కూడా మొదట్లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే..జబర్ధస్త్ కామెడీ షో లో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. 

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఆ తర్వాత ‘కంచె’ లాంటి అవార్డు సినిమాలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు.  ఇక ఫిదా, తొలిప్రేమ సినిమాలతో ఘన విజయం సాధించిన వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఒకసారి మాత్రం తన తండ్రి తనని కొట్టాడనీ .. ఆ తరువాత మాత్రం ఆయన చాలా బాధపడ్డారని అన్నారు. నేను ఇంటర్ చదువుతున్న రోజులు .. ఓ రోజు రాత్రి నేను నా స్నేహితుల దగ్గరికెళ్లి కబుర్లు చెబుతూ ఉండగా, నన్ను వెతుక్కుంటూ మా నాన్న అక్కడికి వచ్చారు. నన్ను అక్కడ చూడగానే కోపాన్ని అణచుకోలేక కొట్టేశారు".  ఇంటికి వెళ్లి ఈ విషయం మా అమ్మతో చెప్పానే..అయితే మా నాన్న అంత సీరియస్ కావడానికి కారణం చెప్పింది. నేను మా ఫ్రెండ్స్ తో కబుర్లు పెట్టుకుంటూ టైమ్ మర్చిపోయానే..ఆ సమయంలో నా మొబైల్ కూడా పని చేయలేదు.

దాంతో నాన్న నా కోసం మూడు గంటలకు పైగా వెతికారట..ఆ సమయంలో నేను కనిపించే సరికి కోపం ఆపుకోలేక చేయి చేసుకుని ఉంటారని అమ్మ చెప్పింది. ఆ తర్వాత నాపై చేయి చేసుకున్నందుకు నాన్న కూడా బాధపడ్డాట..ఇంకెప్పుడూ చేయి చేసుకోనని అమ్మతో చెప్పారట. ఆయన అంత క్రమశిక్షణతో ఉన్నారు కనుకనే ఈ స్థితిలో ఉన్నామని వరుణ్ తేజ్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: