అమ్మాయిని ముద్దు పెట్టి కష్టాల్లో పడ్డ సింగర్..!

Edari Rama Krishna
తాము సెలబ్రెటీలం అని..తాము ఏం చేసినా చెల్లిపోతుందని కొంత మంది అనుకుంటారు..కానీ కొన్నిసార్లు అవి రివర్స్ అవుతున్ సందర్భాలు ఎన్నో జరిగాయి. తాజాగా ప్రముఖ సింగర్ ఓ అమ్మాయిని పెదాలపై ముద్దు పెట్టుకొని లేని పోని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే..సింగింగ్ షోలో పాల్గొన్న ఓ మైనర్ గర్ల్‌పై అనుచితంగా ప్రవర్తించాడు పేరు మోసిన సింగర్. హోలీ సెలబ్రేషన్స్‌ కోసం చేస్తున్న ఓ షోలో ఆ అమ్మాయికి రంగులు పూసిన ఆ సింగర్, తరువాత ఆమె పెదాలపై ముద్దును పెట్టాడు. 

ప్రస్తుతం అసోం కు చెందిన గాయకుడు,సంగీత దర్శకుడు అయినా అంగారగ్ పాపోన్ ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే వాయిస్ ఇండియా కిడ్స్ షో కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.  ఈ షో లో హోలీ సందర్భంగా ఒక ఒక స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. ఈ షో లో హోలీ ఆడుతూ పాపోన్ ఒక బాలికకు రంగులు పూసి అంతటి తో ఆగకుండా ఆ 16 ఏళ్ల మైనర్ బాలికను ముద్దాదాడు. 

అంతే కాదు  ఈ వ్యవహారాన్నంతా తన ఫేస్‌బుక్ ఫేజీలో లైవ్ కూడా ఇచ్చాడు ఆ ప్రబుద్ధుడు. ఇది చూసిన అవాక్కయ్యారు అతడి అభిమానులు. ఈ కార్యక్రమం పేస్ బుక్ లో లైవ్ రావడంతో అది చుసిన నెటిజన్లు ఈయనను వెంటనే షో నుంచి తొలగించాలని కోరుకుంటున్నారు.

సుప్రీమ్ న్యాయవాది రుణా భుయాన్ అయితే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం లో ఫిర్యాదు కూడా చేశారు. 'బర్ఫీ', 'బేఫిక్రే', 'సుల్తాన్', 'దమ్ లగా కే హైసా' పలు చిత్రాల్లో పాటలు పాడి మెప్పించాడు. అయితే పాపోన్ ఇప్పటి వరకు ఈ ఫిర్యాదుపై స్పందించకపోవడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: