తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ తర్వాత హీరో నానితో ఎవడే సుబ్రమణ్యంలో కనిపించాడు. ఇక హీరోగా పెళ్లిచూపులు చిత్రంతో మంచి గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు బోలెడంత ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
మొదట ఈ చిత్రంపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా..థియేటర్లో రిలీజ్ అయిన పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కింది. విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి మూవీ ఇంత పెద్ద స్టార్ చేసేసిందా అనిపిస్తుంది. ఎందుకంటే.. హైద్రాబాద్ లాంటి సిటీలో మూడొంతుల థియేటర్లలో ఈ చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు.
అది కూడా ఈ యంగ్ హీరో అసలేమాత్రం ప్రచారం చేయకుండానే ఇంతటి రిలీజ్ లభించడం చెప్పుకోవాల్సిన విషయం. తెలుగులో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఓ రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. తమిళంలోను ఆయన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమాకి 'నోటా' (NOTA) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్నికల పరిభాషలో 'నోటా' అంటే .. 'ఈవీఎం'లో సూచించిన అభ్యర్థులనెవరినీ నేను ఎన్నుకోవడం లేదంటూ ఓటర్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం. విజయ్ దేవరకొండ ఇంతవరకూ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.