ప్రముఖ సింగర్ తనయుడు అరెస్ట్..!

Edari Rama Krishna
చట్టం ముందు అందరూ సమానమే..అయితే వారు రాజకీయ నాయకులైనా..సినీ సెలబ్రెటీలు అయినా..క్రీడారంగానికి చెందిన వారైనా నేరాని పాల్పడితే..అది రుజువైతే శిక్ష పడటం ఖాయం.  బాలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ఉదిత్ నారాయణ అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఉదిత్ నారాయణ తనయుడు ఆదిత్య నారాయణ్ అరెస్ట్ అయ్యాడు.

సోమవారం సాయంత్రం ఆయన తన మెర్సిడెస్ బెంజ్ కారును ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లి లోఖండ్వాలాలో ఓ ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటో డ్రైవర్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. దాంతో ఆదిత్యపై సెక్షన్ 338, 279 కింద కేసులు నమోదు చేసిన వెర్సోవా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.   అనంతరం రూ.10వేల పూచీకత్తుతో బెయిలుపై విడుదల చేశారు. కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. 

ప్రమాదం జరిగిన వెంటనే ఆదిత్య క్షతగాత్రులను స్వయంగా కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్‌కు తరలించారు.  ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ బాబూరావు పాలేకర్ ఐసియూలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆటోలో ప్రయాణిస్తున్న సురేఖ అంకుష్ శివేకర్ అనే మహిళా ప్యాసెంజర్‌కు ఈ యాక్సిడెంట్‌లో కాలు విరిగింది.   ఆదిత్య నారాయణ్ పలు సినిమాల్లో పాటలు పాడాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: