పడుకుంటేనే ఆఫర్లు.. మేం ఎక్స్ పోజ్ చెయ్యడం లేదా? : నటి శ్రీరెడ్డి

Edari Rama Krishna
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ (పడక సుఖం)పై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నరు వర్థమాన నటీమణులు.  ఆ మద్య మాలీవుడ్ బ్యూటి భావనపై లైంగిక వేధింపుల తర్వాత ఆమె వారిపై పోరాడి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్లు గతంలో తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మాద్యమాల ద్వారా వెల్లడించారు.  తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌ (పడక సుఖం) గురించి వర్థమాన నటి  శ్రీరెడ్డి  పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 


తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఆఫర్లు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.   టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని పేర్కొంది. తెలుగు అమ్మాయిలు దానికి అంగీకరించడం లేదనే అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొంత మంది మెయింటెనెన్స్ కోసం కాస్టింగ్ కౌచ్ బాధితులుగా మారుతున్నారని బాధపడింది.


 ఒక ప్రాజెక్ట్ అయిపోతే మరో ప్రాజెక్ట్ ఎప్పుడోస్తుందో తెలియదు. వస్తుందా రాదా అనే ప్రశ్నార్థకం. హైదరాబాద్‌లో బతకాలంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు ఎలా జీవించాలి అనే ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికీ ఒప్పుకున్నా ప్రధానమైన పాత్రలు రావని, ఏదో ఒక పాత్ర చెయ్యమంటారని తెలిపింది. 


తెలుగు సినిమాలు 100 బయటకు వస్తే 2 కూడా హిట్ కావడం లేదని, ఒక్క దానిలో కూడా నేటివిటీ ఉండదని తెలిపింది. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ చూస్తున్నవారు, వెనక నాన్నల పేర్లు తగిలించుకున్న వారందరికీ ముంబై, బెంగళూరు, చెన్నై, అమ్మాయిలు కావాలని చెప్పింది. తెలుగమ్మాయిలు ఏం తప్పు చేశారు? వాళ్లు ఫిజిక్ మెయిన్‌ టైన్ చెయ్యడం లేదా? ఎక్స్‌పోజ్ చెయ్యట్లేదా? హాట్‌ గా లేరా? కోరికలు తీర్చడం లేదా? అని నిలదీసింది. 

తెలుగమ్మాయిలైతే పడుకునేందుకు కాంప్రమైజ్ కారని తెలిపింది. తీరా దానికి కూడా సిద్ధమంటే చిన్న క్యారెక్టర్ ఇస్తారని పేర్కొంది. తాను మీడియాలో పని చేయడం వల్ల ధైర్యంగా చెబుతున్నానని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: