మహేష్ వెన్నుపోటుకు సహకరించిన వ్యక్తి ఎవరు ?

Seetha Sailaja
‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీ సక్సస్ మ‌హేష్ కు కీలకంగా మారడంతో ఈమూవీ రిలీజ్ కు ముందు సుమారు 20 రోజులపాటు ప్రమోట్ చేసే వ్యూహాలను మహేష్ ఇప్పటికే డిజైన్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నేపధ్యంలో నడిచే ఈసినిమా కథలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. 

అయితే మహేష్ ముఖ్యమంత్రి సీన్స్ ఈసినిమా చివ‌రి 30 నిమిషాల్లో కనిపిస్తాయని తెలుస్తోంది. ఇందులో ఒక వెన్నుపోటు ఎపిసోడ్ ఉంద‌ని తెలుస్తోంది. మ‌హేష్ సీఎమ్ అయ్యాక‌ అత‌డికి వస్తున్న ఫాలోయింగ్ భ‌రించ‌లేక‌ చేస్తున్న మంచి ప‌నులు చూసి ఓర్వ‌లేక సొంత పార్టీలోని మనుషులే మ‌హేష్ ని వెన్నుపోటు పొడుస్తార‌ని తెలుస్తోంది. 

ఆ విధంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన భ‌ర‌త్ తరిగి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి భరత్ పాత్రలో నటించిన మహేష్ ఏమి చేసాడు అన్నది ఈమూవీ క్లైమాక్స్ అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య వైరం న‌డుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం ఒంటెద్దు పోక‌డ‌తో దూసుకుపోతోంద‌ని రాష్ట్రాలు ఆవేద‌న‌ వ్యక్త పరుస్తున్నాయి. 

ఈవిషయాలు అన్నీ ఈసినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం పై తిరుగుబాటు చేసిన ఒక రాష్ట్ర సీమ్ క‌థగా ఈ మూవీ కథకు కొన్ని మార్పులు చేసారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయాలకు అతి దగ్గరగా ఉండే కొన్ని సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా కొరటాల ఈమూవీలో డిజైన్ చేసినట్లు టాక్. ప్రస్తుతం మన ఇరు రాష్ట్రాలలోను కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడల పై విపరీతమైన వేడి రగులుతున్న నేపధ్యంలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న సీన్స్ ‘భరత్ అనే నేను’ లో ఉంటే ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: