నాగార్జున బాధను ఎంజాయ్ చేసిన వర్మ !

Seetha Sailaja
‘శివ’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తనకు మళ్ళీ ఒక సూపర్ హిట్ ను ఇస్తాడని నాగార్జున ఎన్నో ఆసలు పెట్టుకుని ‘ఆఫీసర్’ మూవీలో నటిస్తున్నాడు. దేవుడి కంటే నాగార్జుననే ఎక్కువగా నమ్ముతానని వర్మ అనేక సార్లు మీడియా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే అటువంటి వర్మ నాగార్జున బాధను ఎంజాయ్ చేసానని చెప్పడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈమధ్య రామ్ గోపాల్ వర్మ అనేక సమస్యలలో చిక్కుకున్నా ఆవిషయాలను పట్టించుకోకుండా నాగార్జునతో తాను తీస్తున్న మూవీ షూటింగ్ ను ముంబాయితో పాటు పలు లొకేషన్లలో చాల వేగంగా పూర్తి చేసాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ షూటింగ్ 99శాతం పూర్తయింది అని టాక్. 

ఇక కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అని అంటున్నారు. ఈసినిమా ఆఖరి షెడ్యూల్ పూర్తిచేసిన నాగ్ హైదరాబాద్ వచ్చేశాడు. ఇప్పటివరకు తీసిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని రామ్ గోపాల్ వర్మను అతడి టీమ్ ను మిస్ అవుతున్నానంటూ బాధపడే ఎమోజీలతో ట్వీట్ చేశాడు నాగ్. దీనికి రామ్ గోపాల్ వర్మ విలక్షణమైన రీతిలో తన స్పందనను తెలియచేసాడు. 

తన టీమ్ తో కలిసి నవ్వుతూ దిగిన ఫొటోను పోస్ట్ చేసి ఆ ఫోటోతో పాటుగా ఒక ట్విట్ కూడ చేసాడు. "నాతో పాటు నా యూనిట్ అంతా నవ్వుతూ సరదాగా ఉన్నట్టు నటిస్తున్నాం. నిజానికి మా బాధను మేం దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాం. ప్రేమ ప్రేమను ఎంత ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం."  అంటూ వర్మ ట్వీట్ చేసాడు. అయితే ఈసినిమాకు ఇప్పటికీ క్రేజ్ ఏర్పడకపోవడంతో పాటు ఈమూవీ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగక పోవడం అటు వర్మను ఇటు నాగార్జునను ఆశ్చర్య పరుస్తున్నట్లు తెలుస్తోంది..
Hey @iamnagarjuna , inspite of u leaving us and going off to Hyderabad,Me and my assistants of u the #Officer are trying to act Happy but basically we desperately are hiding our real sadness ..Sir we all love u more than love loves love 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: