కత్తి మహేష్ ఆఫర్ తో పవన్ కు ఊహించని ట్విస్ట్ !

Seetha Sailaja
నిన్న గుంటూరులో జరిగిన ‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ చేసిన ఉత్తేజకరమైన ఉపన్యాసానికి కత్తి మహేష్ పాజిటివ్ గా స్పందిస్తూ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కు ఒక ఆఫర్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తాను ఆమరణ దీక్షకు సిద్ధం అంటూ పవన్ ఉద్వేగపూరితంగా చేసిన ఉపన్యాసానికి కత్తి మహేష్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. 

ప్రత్యేకహోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే తాను కూడా జాయిన్ అవుతాను అంటూ పవన్ అభిమానులకు ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.  ఈవిషయమై ఒక ట్వీట్ చేసి తన బంపర్ ఆఫర్ కూడ ఇచ్చాడు. అయితే నిన్న పవన్ చేసిన ఉపన్యాసం పై కొన్ని సందేహాలు కూడ వ్యక్తపరుస్తున్నాడు ఈ సినీ రాజకీయ విమర్శకుడు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు చెప్పాల్సిన క్షమాపణలు పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టు అనిపిస్తోందని అంటూ సెటైర్లు వేశారు. అయినా పవన్ కళ్యాణ్ స్పీచ్ ని తాను స్వాగతిస్తున్నాను అంటూ పవన్ కు తన అభినందనలు తెలియచేసాడు కత్తి మహేష్. ఇది ఇలా ఉండగా నిన్న పవన్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన పై కొందరు సెటైర్లు వేస్తున్నారు. పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీలు తమ నిరసన తెలపడానికి అస్త్రంగా ఉపయోగించిన ఆమరణ నిరాహారదీక్ష ఈరోజుల్లో సాధ్యమయ్యే పనేనా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

గత కొన్నేళ్లుగా అనేక మంది నాయకులు అనేక లక్ష్యాలతో ఆమరణ నిరాహార దీక్షలు చేసిన నేపధ్యం ఉన్నా ఐదారు రోజులు గడిచిన తరువాత దీక్ష చేస్తున్న ఆ నాయకుడు ఆరోగ్యం  క్షీణించింది అని దీక్షా భంగం చేసి ఆస్పత్రిలో సెలైన్ ఎక్కించిన సంఘటనలు ఉన్న నేపధ్యంలో పవన్ ఆమరణ నిరాహారదీక్ష ఎంత వరకు వాస్తవ రూపం దాలుస్తుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో హీరో శివాజీ కూడ ఇవే మాటలు అన్న నేపధ్యాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: