స‌ర్‌ప్రైజ్ చేసిన రాంచరణ్ న్యూ లుక్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి..రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ తో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు.  అప్పట్లో ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.  అయితే ఇండస్ట్రీలో రాంచరణ్ చాలా తక్కువ సినిమాలు తీసినా దాదాపు అన్నీ సూపర్ హిట్స్ కావడం విశేషం. 

గత సంవత్సరం ‘ధవ’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని కారణాల వల్ల ఈ మార్చి 30 కి రిలీజ్ అవుతుంది.  ఇక రంగస్థలం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు సుకుమార్ ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా జాగ్రత్తగా తీసినట్లు సమాచారం..అందుకే ఆయన కొన్ని సీన్లు రీ షూట్ కూడా చేశారు. 

మొత్తానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ‘రంగస్థలం’ ఇప్పుడు ప్రమోషన్ వర్క్ పై దృష్టి చూపిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర‌లో చెవిటి వ్య‌క్తిగా క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు చెర్రీ. ఈ పాత్ర కోసం భారీ గ‌డ్డం పెంచుకొని మొన్న‌టి వ‌ర‌కు డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించిన చెర్రీ తాజాగా న్యూ లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. 

తాజాగా జోష్ ఫాంట‌సీ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో హాజ‌రైన రామ్ చ‌ర‌ణ్ క్లీన్ షేవ్‌తో కొత్త‌గా క‌నిపించాడు.  త్వరలో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్నాడు చెర్రీ. ఇందులో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించ‌నున్నాడు. అంతే కాదు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ ప్రొడ‌క్ష‌న్ పనులు చూసుకోవడంలో బిజీగా గడపబోతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: